
ప్రజాశక్తి - భీమవరం రూరల్
శాసనమండలి ఛైర్మన్ మోషేన్‌రాజు ఆయన నివాసం వద్ద గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి గాంధీ ఆశయాలను, త్యాగాలను వివరించారు. ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు ఆయన నివాసంలో జనసైనికులతో కలిసి గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్‌పి కార్యాల యంలో ఎస్‌పి రవిప్రకాష్, ఎఎస్‌పి అల్లూరి సుబ్బరాజు గాంధీ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.
పెనుమంట్ర : మార్టేరు ఎస్‌విజిహెచ్ హైస్కూల్‌లో మహాత్మ గాంధీ విగ్రహాలకు సర్పంచి మట్టా కుమారి ఆధ్వర్యంలో జెడ్‌పిటిసి సభ్యులు కర్రి గౌరీ సుభాషిణి పూలమాల వేసి నివాళులర్పించారు. వరిశోధనా సంస్థలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ షేక్ మదీనా బాషా, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ పి.పద్మజ, తహశీల్దార్ దండు అశోక్ వర్మ ఆధ్వర్యంలో గాంధీకి చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భీమవరం : మహాత్మ గాంధీజీ చేతులమీదుగా 104 ఏళ్ల క్రితం ముంబైలో ప్రారంభించిన యూనియన్ బ్యాంక్ దేశంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా విరజల్లుతోందని పిడిడిఆర్‌డిఎ వేణుగోపాల్ అన్నారు. స్థానిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయంలో రీజనల్ హెడ్ పి.సంగీతకుమారి అధ్యక్షతన గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా వేణుగోపాల్ హాజరై మాట్లాడారు. భీమవరం పట్టణం పిఎస్‌ఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శానిటరీ పాడ్ మిషన్, దిస్పోసభుల్ మెషీన్లు అందించారు. ఝాన్సిలక్ష్మీభారు బాలికల ఉన్నత పాఠశాలలో రూ. రెండు లక్షల ఖర్చుతో మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం విరాళాన్ని అందించారు. మహిళలు రూ.రెండు కోట్ల రుణాలను మంజూరు చేసిన పత్రాలను వేణుగోపాల్ చేతులమీదుగా లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ వెంకటేశ్వరరావు, దివాకర్, చీఫ్ మేనేజర్లు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
మొగల్తూరు : మండల కేంద్రంలోని పంచాయతీ పాలకవర్గ సభ్యులు గాంధీభవన్ సెంటర్ ప్రాంతంలో ఉన్న మహాత్ముని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పడవల మేరి సత్యనారాయణ, వైస్ ఎంపిపి సుబ్బారావు, ఉప సర్పం చి నరసింహరావు పాల్గొన్నారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య యువ జన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండ పంలో, గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతాల్లో గాంధీ విగ్రహా లకు సంఘ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు.
కాళ్ల : మహాత్మా గాంధీ స్వాతంత్య్ర ఉద్యమంలో చేసిన సేవలు చిరస్మరణీయమని కాళ్ల ఎంఇఒ-2 గాదిరాజు కనకరాజు అన్నారు. బొండాడ చినపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోపల్లె, వేంపాడు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గాంధీ విగ్రహాన్ని ఎంఇఒ-2 గాదిరాజు కనకరాజు ఆవిష్కరించారు. విద్యార్థులకు, పిల్లలకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లిపట్ల భాస్కరరావు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోపల్లె, వేంపాడు శాఖల ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు దూడే సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఎం.చంద్రశేఖర్‌వర్మ, స్థానికులు దొండపాటి రవిచంద్రన్ పాల్గొన్నారు. బొండాడపేట గ్రామ సచివాలయంలో పారిశుధ్య కార్మికులను సన్మానించారు. బొండాడ పేట పంచాయతీ కార్యదర్శి చెన్ను సుజాత, జక్కరం గ్రామ సర్పంచి కూచంపూడి పద్మావతి, గ్రామ కార్యదర్శి ఎస్బొం కె.జమల్, బొండాడపేట సర్పంచి గోళ్ల వెంకటసత్యనారాయణ, ఉప సర్పంచి గుడ్ల మధుసూదన్‌రావు, ఎంపిటిసి సభ్యులు గుత్తికొండ సత్యనారాయణ పాల్గొన్నారు.
పెనుగొండ : పెనుగొండ మేజర్ గ్రామపంచాయతీ వద్ద సర్పంచి నక్కా శ్యామలా సోని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ శ్రీనివాస్ దొర, జెడ్‌పిటిసి సభ్యులు పోడూరి గోవర్ధని రామయ్య, వార్డు సభ్యులు చిట్నీడి రాము, మండ ప్రసాద్, పులిగోరు రవికుమార్, బండారు నాయుడు, చేవూరి శ్రీదేవి, వేండ్ర మంగ, కనకదుర్గ, సిద్దిరెడ్డి స్వాతి హేమ, దొమ్మేటి దేవి, పిల్లి చాముండేశ్వరరావు పాల్గొన్నారు.
గణపవరం : మండలంలోని పిప్పర గ్రంథాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు, జిల్లా పంచాయతీ అధికారి జివికె.మల్లికార్జునరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కాకర్ శ్యామ్, పంచాయతీ కార్యదర్శి జి.బాలకృష్ణ, రామారావు పాల్గొన్నారు.
పాలకోడేరు : విస్సాకోడేరు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ డిఆర్.స్వర్ణలత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూలు వైస్ ప్రిన్సిపల్ రిచి జాన్ కిడ్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాలకోడేరు తహశీల్దార్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి జిల్లా ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్, మోనిటరింగ్ కమిటీ సభ్యులు పొన్నమండల బాలకృష పూలమాలవేసి నివాళులర్పించారు. గాంధీ, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ విగ్రహాలకు శ్రీ వాసవీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూర్య ప్రకాశరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆచంట : స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపిపి దిగమర్తి సూర్యకుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి తాళం శ్రీనివాసరావు, ఎంపిటిసి సభ్యులు బాలసుబ్ర హ్మణ్యం, తమ్మినీడి పృథ్వి కుమార్, సుబ్బారావు, దాసిరెడ్డి పుణ్యవతి, వెంకటలక్ష్మి, ఇఒపిఆర్‌డి బాబు పాల్గొన్నారు.
ఉండి :ఉండిలో వైసిపి గ్రామ అధ్యక్షులు కరిమెరక మల్లికార్జున ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపిపి, ఎంపిపిల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు మాట్లాడారు. అనంతరం పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పెన్మెత్స ఆంజనేయరాజు, జిల్లా బిసి సంఘం అధ్యక్షులు సూరవరపు వెంకటాచార్యులు, నాయకులు రణస్థుల మహంకాళి, గుండాబత్తుల సుబ్బారావు, బడుగు బాలాజీ, కమతం బెనర్జీ, అంగర రాంబాబు, శేషాద్రి శ్రీనివాస్, రాయి సతీష్, సిరికి ఎర్రయ్య పాల్గొన్నారు.
పోడూరు : మండలంలోని పోడూరు గ్రామపంచాయతీలో గాంధీ జయంతి సందర్భంగా పంచాయతీలో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి సర్పంచి సెట్టిబత్తుల సువర్ణరాజు సన్మానం చేశారు. తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి.రవి, సూర్య ఫణీంద్ర పాల్గొన్నారు.
నరసాపురం టౌన్ : జనసేన నరసాపురం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, పిఎసి సభ్యులు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మన్ బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, కొల్లాటి గోపీకృష్ణ, గంటా కృష్ణ, నిప్పులేటి తారక రామారావు, ఆకుల వెంకటస్వామి, తోట అరుణ, తోట నాని, కొట్టు రామాంజనేయులు, బొమ్మిడి కృష్ణమూర్తి, రావూరి సురేష్, పోలిశెట్టి గణేశ్వరరావు పాల్గొన్నారు.మీరా స్మారక గ్రంథాలయంలో గాంధీ చిత్రపటానికి గ్రంథాలయ నిర్వహణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ముచ్చర్ల త్రిమూర్తులు, కవురు పెద్దిరాజు పూలమాలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ సభ్యులు పొన్నాడ రాము పాల్గొన్నారు.
పోడూరు : మండలంలోని తూర్పుపాలెంలో ఎంఎల్‌ఎ శ్రీరంగనాథరాజు క్యాంపు కార్యాలయంలో గాంధీకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు గుంటూరి పెద్దిరాజు, తూర్పుపాలెం సర్పంచి గుబ్బల ఉషారాణి, వీరబ్రహ్మం, పోడూరు సాయిబాబా పాల్గొన్నారు.