ప్రజాశక్తి - కలిదిండి
ఎన్‌టిఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా మండలంలోని వెంకటాపురం, గోపాలపురం, కొండూరు, మూలలంక, పడమటిపాలెం, ఎస్‌ఆర్‌పి అగ్రహారం, కొండంగి, కలిదిండి గ్రామాల్లోని ఎన్‌టిఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేకులు కట్ చేసి. స్వీట్లు పంచారు. టిడిపి మండల అధ్యక్షులు పోకల జోగిరాజు, ఎఎంసి మాజీ ఛైర్మన్ వల్లభనేని శ్రీనివాస చౌదరి, సర్పంచులు గూడవల్లి శ్రీనివాసరావు, పరసా వెంకట స్వామి, నాయకులు లంకా రత్నారావు, మేకా భోగేశ్వరరావు, విజరు, నున్న సుబ్రహ్మణ్యం, వల్లభనేని సత్యన్నారాయణ, కురేళ్ల ఏడుకొండలు, పేరం ప్రసాద్, సానబోయిన విష్ణు పాల్గొన్నారు.
టి.నరసాపురం : నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు టిడిపి ఆధ్వర్యంలో మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాజుపోతేపల్లి, బందంచర్ల, ఏపిగుంట, తిరుమలదేవిపేట, మక్కినవారిగూడెం గ్రామాల్లో ఎన్‌టిఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వీట్లు పంపిణీ చేసి ఆయన రాష్ట్రానికి చేసి సేవలను కొనియాడారు. అనంతరం రాజమండ్రిలో జరిగే మహానాడుకు మండలం నుండి అధిక సంఖ్యలో తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో నల్లూరి వెంకట చలపతిరావు, ఆచంట సూర్యనారాయణ, తోట లక్ష్మీనారాయణ, వాసిరెడ్డి మోహన్‌రావు, ఆచంట అనిల్ కుమార్, కాసనేని మాధవరావు, సందేపూడి సాయి, కొల్లి రమేష్ పాల్గొన్నారు.
భీమడోలు :మండలంలో ఎన్‌టిఆర్ జయంత్యుత్సవాలు టిడిపి ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. దీనిలో భాగంగా భీమడోలు సంతపేట, పంచాయతీ కార్యాలయం వద్ద, వడ్ల పట్ల, పూళ్ల గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న గన్ని వీరాంజనేయులు ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూళ్లలో నిర్వహించిన కార్యక్రమంలో టిడిపిలో చేరేందుకు వచ్చిన కొందరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు, భీమడోలు మాజీ జెడ్‌పిటిసి సభ్యులు కరణం పెద్దిరాజు, షేక్ మీరా, దూసనపూడి పుల్లయ్య నాయుడు, పట్నాల వెంకటేష్‌ను సత్కరించారు.
ముదినేపల్లి : ఎన్‌టిఆర్ శతజయంతి వేడుకలు మండలంలో ఘనంగా జరిగాయి. స్థానిక వై కూడలి వద్ద ఉన్న ఎన్‌టిఆర్ విగ్రహానికి యువనేత కొడాలి వినోద్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని చిగురుకోట, అల్లూరు, గురజ, చేవూరు, వైవాక, పెదపాలపర్రు, కోడూరు తదితర గ్రామాల్లోని ఎన్‌టిఆర్ విగ్రహాలకు టిడిపి నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బొర్రా చలమయ్య, పంతగాని సురేష్, వి.నరసింహారావు, బొంగు రవికుమార్, కె.విఠల్, పి.పాండురంగారావు, పి.విశ్వేశ్వరరావు, బి.బాలాజీ, ఎల్.భానుప్రసాద్, బి.రవి పాల్గొన్నారు.
చాట్రాయి : నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. చాట్రాయిలో పార్టీ గ్రామ అధ్యక్షులు గడ్డం ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి కోట జోషి, కంచర్ల హనుమంతరావు, ఎలికే వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి, కంపసాటి సర్వేశ్వరరావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలవరం గ్రామంలో ఎర్ర హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం : పట్టణం, మండలంలో ఎన్‌టిఆర్ శతజయంతి వేడుకలను టిడిపి నేతలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఎన్‌టిఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని బైపాస్ రోడ్డులో చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే కేక్ కట్ చేసి నివాళులర్పించారు. టిడిపి సీనియర్ నాయకులు అల్లూరి రామకృష్ణ, మానికల వెంకటేశ్వరావు, గెడా సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజిబాబు, చిత్తపురి దుర్గేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే అశ్వారావుపేట రోడ్డులోని ఎన్‌టిఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజమండ్రిలో జరిగే మహానాడుకు నాయకులు, కార్యకర్తలు కారులు, ఆటోలలో అధికసంఖ్యలో తరలివెళ్లారు.
ఆగిరిపల్లి:ఎన్‌టిఆర్ శతజయంతి సందర్భంగా ఆదివారం ఆగిరిపల్లి మెయిన్‌సెంటర్‌లో టిడిపి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఆగిరిపల్లి గ్రామ అధ్యక్షులు పామర్తి నరసింహారావు, నాయకులు ఎం.సత్యకుమార్, ఆర్.నాగమణి, బి.శ్రీనివాసరావు, ఎం.శ్రావణ్‌కుమార్, టి.ఆదినారాయణ, చంటి పాల్గొన్నారు.










