
ప్రజాశక్తి -గోపాలపట్నం : టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టిఆర్ పాలనలోనే అభివృద్ధికి అంకురార్పణ జరిగిందని, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. ఎన్‌టిఆర్ శతజయంతిని పురస్కరించుకుని 90వ వార్డు విమాననగర్‌లో ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టిడిపి విశాఖ పార్లమెంటరీ పార్టీ సెక్రటరీ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో నాలుగువేల మందికి అన్నసమారాధన నిర్వహించారు. 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టిపాటి సురేష్‌కుమార్, నాయకులు బి శ్రీకాంత్, యు బ్రహ్మేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, వేణుబాబు పాల్గొన్నారు.
సీతమ్మధార : విశాఖ రత్న, దాసరి కల్చరల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ శతవసంత వేడుకలు ఆదివారం ముగిసాయి.ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు, సోషల్ మీడియా స్టేట్ చైర్మన్ సన్ మూర్తి, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, నాంచారయ్య బొమ్మిడి సత్యనారాయణ, దుగ్గివలస దివాకర్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిసి సంఘ నాయకులు పోలుమహంతి ఉమామహేశ్వరరావు, సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్ శీను బాబు, కోరుకొండ రంగారావు, వ్యవస్థాపకుడు పిఎ. భాస్కరరావు, కోఆర్డినేటర్ మల్లిక పాల్గొని వివిధ రంగాల్లో నిష్ణాతులను ఎన్‌టిఆర్ పురస్కారాలతో సత్కరించారు.
భీమునిపట్నం : స్థానిక చిన్న బజారు జంక్షన్‌లోని ఆయన విగ్రహానికి టిడిపి నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జివిఎంసి వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ, పార్టీ వార్డు ప్రధాన కార్యదర్శి గొలగాని నరేంద్రకుమార్, వార్డు తెలుగు యువత అధ్యక్షులు కనకల అప్పలనాయుడు, కాసరపు నాగరాజు, కొక్కిరి అప్పన్న, పి లక్ష్మీకుమారి పాల్గొన్నారు
సీతమ్మధార : 26వ వార్డులో కార్పొరేటర్ ముక్కా శ్రావణి ఆధ్వర్యంలో సంఘం కార్యాలయం వద్దఉన్న ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వార్డు సెక్రటరీ పెడ్డ లక్ష్మణ, కన్వీనర్లు రహీం, భాను, ఫాతిమా, వెంకటలక్ష్మి, వరలక్ష్మి పాల్గొన్నారు.
ఆనందపురం : మండలంలోని లోడగలవానిపాలెం గ్రామంలో మాజీ జెడ్‌పిటిసి బమ్మిడి ఉమాదేవి ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక పిహెచ్‌సిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ బమ్మిడి సూర్యనారాయణ, టిడిపి సీనియర్ నేతలు చిరకాన సూరి నాయుడు, కర్రోతు సత్యనారాయణ, ఇల్లిపిల్లి సన్యాసిరావు, నాగోతి రమణ, బంక సూరిబాబు పాల్గొన్నారు
పద్మనాభం : మండల కేంద్రమైన పద్మనాభం జంక్షన్‌లో ఎన్‌టిఆర్ విగ్రహానికి తెలుగు యువత. మండల అధ్యక్షులు కెవి. సత్యనారాయణ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.లీలావతి, మూర్తి, నందీశ్వరరావు పాల్గొన్నారు.
ఆరిలోవ : 10వ వార్డు రవీంద్రనగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ మద్దిల రామలకీë ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 9వ వార్డు జోడుగుళ్ళపాలెంలో వార్డు టిడిపి ఇన్‌చార్జ్ బుడుమూరు గోవిందు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మారుపల్లి చిన్నారావు, గరికిన నూకరాజు, మైలపల్లి శ్రీను, నాగేశ్వర్రావు, భూలకీë పాల్గొన్నారు.
12వ వార్డు టిడిపి ఇన్‌చార్జ్ ఒమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో ఆరిలోవ కాలనీ, దుర్గాబజార్, బాలాజీనగర్, తోటగరువు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. టిడిపి నాయకులు ఏడువాక సన్యాసిరావు, కృష్ణంరాజు, కొత్తల గోపాల్, బసవ దేవుళ్ళు, బండారు శంకరరావు, పేరినాయుడు పాల్గొన్నారు.
కలెక్టరేట్ : సనరా- చందు ఆర్ట్స్ మూవీస్ ఆధ్వర్యాన విజెఎఫ్ ప్రెస్ క్లబ్‌లో ఎన్‌టిఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు మణిశర్మ, ఆడారి కొండలరావు, ఐడిజెఎన్ పత్రం ఆరు జిల్లాల ఇన్‌ఛార్జి విశాఖ చాప్టర్ సిటీ అధ్యక్షులు గొట్టివాడ దనేష్, నాటక గ్రంథాలయం వ్యవస్థాపక అధ్యక్షులు బాదంగీర్ సాయి, నాటక రంగ ప్రముఖులు, కరాటే క్రీడాకారిణిలను ఎన్‌టిఆర్ పురస్కారాలను నిర్వాహకులు అందజేసి సత్కరించారు. విశాఖ సమాచారం దినపత్రిక సంపాదకులు సూరంపూడి వీరభద్రరావు, ప్రజాప్రస్థానం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తోట ముకుంద్, విజెఎఫ్ ఉపాధ్యక్షులు నాగరాజు పట్నాయక్, సనరా -చందు ఆర్ట్స్ మూవీస్ నిర్వాహకులు పాల్గొన్నారు.
ఆర్‌కె.బీచ్‌లోని ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద తెలుగు శక్తి అధ్యక్షులు బివి.రామ్ నివాళులర్పించారు. బోడెపూడి దొరబాబు, శివ నాగేశ్వరరావు, వసంతరావు పాల్గొన్నారు.
రాగమయ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు కంధర్ప రాధ, గంటి అభినయల సారధ్యంలో ఎన్‌టిఆర్ శతజయంతి ఉత్సవాలు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఎమ్‌వి.రాజశేఖర్, మహమ్మద్ ఖాన్, జెఎన్‌ఆర్ నెహ్రూ, భపుండరీ కుమార్ పాల్గొన్నారు.
మాడుగుల:మండల కేంద్రంలో ఆదివారం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. నేతలు పుప్పాల అప్పలరాజు, లెక్కల కాశిబాబు, రంజిత్ వర్మ, సూరిబాబు, వేగి రాంబాబు, ఢిల్లీ నానాజీ, పంతులు మూర్తి, సూరి, ఎస్‌వి పాల్గొన్నారు.
కోటవురట్ల:మండల కేంద్రంలో ఆ పార్టీ అధ్యక్షులు జానకి శ్రీను ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మండల టిడిపి ప్రధాన కార్యదర్శి లింగన్న నాయుడు, తెలుగు యువత అధ్యక్షులు తిరుమలరావు, సుంకర బాబ్జి, పెట్ల నరేష్, కొల్లాటి అప్పారావు, తంగేటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అనకాపల్లి:ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అనకాపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పరమేశ్వరి పార్క్ జంక్షన్‌లో బాలకృష్ణ ఫాన్స్ పొలిమేర నాయుడు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సత్యనారాయణ, బొడ్డేడ మురళి, కర్రి గోపి, దాడి జగన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ వద్ద జరిగిన కార్యక్రమంలో టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు మాట్లాడారు.
మునగపాక రూరల్ : టిడిపి నాయకులు స్థానిక మెయిన్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో దాడి శివ, ఆడారి లక్ష్మణరావు, ఆడారి జానకి, మాలతి, అప్పలరాజు, మల్ల శేషుబాబు, కోరుకొండ ప్రసాద్, పాల్గొన్నారు.
పరవాడ : పరవాడ సంత బయలు వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ జడ్పిటిసి పైలా జగన్నాధరావు, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు పూల మాలలు వేసి నివాళులర్పించారు. రావాడ ఎన్టీఆర్ కాలనీ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి గ్రామ టిడిపి నాయకులు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అట్టా సన్యాసి అప్పారావు, పయిల బుజ్జి, పయిల కృష్ణ, వర్రి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
కశింకోట : మండల కేంద్రంలోని ఎన్‌టిఆర్ బసవతారకం విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కాయల మురళి, ఉగ్గిన రమణ మూర్తి, పెంటకోట రాము, వేగి గోపి కృష్ణ, సిద్ధిరెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సబ్బవరం : టీడీపీ మండల అధ్యక్షుడు మిడతాడ మహాలక్మి నాయుడు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు గండి దేముడు, కోటాన అప్పారావు, రొంగలి దేముడు, బోకం సత్యనారాయణ పాల్గొన్నారు.
అచ్యుతాపురం : మండలంలోని మోసయ్యపేట గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డి.నాయుడు బాబు, ఎల్లపు వెంకటరావు, దేవర కృష్ణ, పుర్రె రాజు, చొప్ప గోవిందరాజు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దిబ్బడి, బుచ్చయ్యపేట, రాజాం జరిగిన కార్యక్రమంలో జి.ముత్యాలు, చిన్ని పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.