May 28,2023 22:47

ప్రజాశక్తి-గండేపల్లి, కరప ఎన్‌టిఆర్‌ శత జయంతి వేడుకలను పలుచోట్ల ఆదివారం ఘనంగా నిర్వహించారు. గండేపల్లిలో టిడిపి మండల అధ్యక్షుడు పోతుల మోహనరావు, ఎలమటి కాశీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలేసి నివాళ లర్పించారు అనంతరం కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, కోర్పు సాయి తేజ, వెంపటి రాజు, ఆళ్ల సత్తిబాబు, విప్పర్ల బాబి పాల్గొన్నారు. మురారిలో పార్టీ గ్రామ అధ్యక్షుడు సుంకవల్లి రాజు ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గురజాల వెంకన్న దొర ఉండవల్లి శీను గద్దె అబ్బన్న పాల్గొన్నారు
కరప మండలంలోని ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహానికి టిడిపి రాష్ట్ర కార్యదర్శి, రూరల్‌ మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మీ సత్యనారాయణ మూర్తి పూలమాలలు వేసి కేకు కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మహేంద్రబాబు, రెడ్డి సత్యనారాయణ, మద్దూరి స్వామి, గంటా వీరన్న చౌదరి, వై.సుకుమార్‌, పులపకూర శుభామహేష్‌, పంపన కన్నారావు, కె.సురేష్‌ పాల్గొన్నారు. కాకినాడ కార్పొరేషన్‌ కాకినాడ రూరల్‌ వలసపాకలులో నటరత్న కళామందిర్‌లో ఎన్‌టిఆర్‌ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకలపూడి సూర్యారావుపేటలో గల జిల్లా పరిషత్‌ హైస్కూలు విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ మార్కులు వచ్చిన ముగ్గురు బాలికలు, ముగ్గురు బాలురకు బహుమతులు, నగదు పురస్కారాన్ని అందజేశారు. కళాకారులకు పురస్కారాలు నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కామేశ్వరరావు, తిక్కని సుబ్బారావు, తురగా సూర్యారావు, గోవిందరావు, మహేష్‌, దాశరద్‌ పాల్గొన్నారు.