Sep 24,2023 01:25

ప్రజాశక్తి - బాపట్ల
సేదా దృక్పథానికి ఎన్ఎస్ఎస్ సజీవ ఉదాహరణని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ వి శ్రీనివాసరావు అన్నారు. జాతీయ సేవా పథకం వ్యవస్థాపక దినోత్సవాన్ని కళాశాలలో ఘనంగా శనివారం నిర్వహించారు. మహాత్మా గాంధీ శత జయంతి సందర్భంగా 1969లో స్థాపించిన ఎన్ఎస్ఎస్ స్వార్ధ రహిత, కుల, వర్ణ రహిత సేవా దృక్పథానికి సజీవ ఉదాహరణ అన్నారు. ప్రతి విద్యార్థి ఎన్ఎస్ఎస్‌లో చేరవచ్చన్నారు. విద్యార్థులు తమ సేవలను అందించడం ద్వారా ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని అన్నారు. నాయకత్వ లక్షణాల నేర్చుకునేందుకు వేదికని అన్నారు. విశ్వవిద్యాలయం దృవీకరణ పత్రం అందజేస్తుందని అన్నారు. వ్యవసాయ క్షేత్రంలో వరి నాటారు. కార్యక్రమంలో    ఎం లత , ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె శ్రీనివాసులు, షేక్ హసీనా భాను, ఎస్ రత్నకుమారి, జి శివనారాయణ, సి సంధ్యారాణి, టివి శ్రీధర్, ఎం రమాదేవి, వి జ్యోతి, ఎం రవిబాబు పాల్గొన్నారు.