ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్ డే
ప్రజాశక్తి - క్యాంపస్ : శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ప్రిన్సిపా ల్ డాక్టర్ సి.భువనేశ్వరి దేవి ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ సేవా పథకం భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, క్రీడలచే నిర్వహించే భారత ప్రభుత్వ రంగ సేవా కార్యక్రమం అన్నారు. సమాజ సేవ ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని పెంపొందింప చేసే లక్ష్యంతో ఇది రూపొందిం దన్నారు. ఎస్.రాధాకష్ణ నేతత్వం లోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ అధికారికంగా విద్యా సంస్థల్లో స్వచ్ఛంద జాతీయ సేవను ప్రవేశపెట్టాలని ప్రతిపా దించారన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ చిహ్నం గురించి వివరించారు. విద్యార్థినులు చదువుతోపాటు ఇలాంటి సేవా, పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని, కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమం లో జాతీయ సేవా పథకం బాధ్యురాలు, అధ్యాపకు రాలు డా. జి శారద మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక సంక్షేమ ఆలోచనల్ని నింపుకొని, విపత్తుల్లో సహాయం అందించడానికి ముందు ఉండా లని, మన కళాశాల, సమాజ పరిసరాలను మన వంతుగా పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థినులకు పిలుపు నిచ్చారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థినులకు ప్రిన్సిపాల్ గుర్తింపు పత్రాలు, బహుమతులు అందించి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో అధ్యా పకులు డా. స్నేహలత, డా.జయమ్మ, టి.యామిని సుధ, విద్యార్థులు పాల్గొన్నారు.










