
ప్రజాశక్తి-యంత్రాంగం
విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఎంవివి.సత్యనారాయణ జన్మదిన వేడుకలు శనివారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు.
సీతమ్మధార : - ఎంవిపి కాలనీలో జరిగిన వేడుకల్లో వికె పిసిపిఐఆర్ యుడిఎ చైర్‌పర్సన్ చొక్కాకుల లక్ష్మి, వైసిపి నాయకులు వెంకటరావు దంపతులు ఎంపీకి పుష్ప గుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆరిలోవ : ఎంవివి సత్యనారాయణకు తూర్పు నియోజకవర్గం వైసిపి నాయకులు అల్లంపల్లి రాజబాబు, పేర్ల విజయచందర్, వానపల్లి ఈశ్వరరావు, గూడపాటి విక్టర్, సత్యాల వెంకట్, పారిపల్లి రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 12వ వార్డు కార్పొరేటర్ అక్కరమాని రోహిణి ఆధ్వర్యాన తోటగరువు ఎర్నిమాంబ కల్యాణమండపంలో ఎంపీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం వార్డులో నూతనంగా మంజూరైన పింఛన్లు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సత్తి మందారెడ్డి, కన్నేటి సుబ్బారెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఎంవిపి.కాలనీ : విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ జన్మదిన వేడుకలు పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, ఇన్‌ఛార్జిల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. పేదలకు పండ్లు పంపిణీ, అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, పట్టణ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, మేయర్ హరి వెంకట కుమారి, వైసిపి నగర అధ్యక్షులు కోలా గురువులు, నెడ్‌క్యాప్ ఛైర్మన్ కెకె.రాజు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, నాయకులు ఆడారి ఆనంద్ కుమార్, ఆళ్ల శివగణేష్, శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. విశాఖ పెదవాల్తేరు ఎల్‌బి కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ ఎంవివి పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది సాదర స్వాగతం పలికారు.