Sep 13,2023 22:08

ఎంఎస్‌ నాయుడు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- మెరకముడిదాం: ఎస్‌ ఇండియా సంస్థ స్థాపకుడు, కీర్తి శేషులు ఎంఎస్‌ నాయుడు జయంతిని పురష్కరించుకుని బుధవారం ఆయన స్వగ్రామం పెద్దమంత్రి పేటలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎస్‌. హర శ్రీరాములు ఆధ్వర్యంలో ఎంఎస్‌ నాయుడు చిత్ర పటానికి పూల మాలలు వేసి గ్రామానికి, పేద విద్యార్థులకు ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా అతని మేనల్లుడు, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎస్‌. హర శ్రీరాములు మాట్లాడుతూ ఒక కుగ్రామంలో పుట్టి, వెస్ట్‌ జర్మనీలో స్థిరపడి తన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటమే కాకుండా అనేక గ్రామాలలో ఉన్న పేద విద్యార్థుల కోసం సేవ చేద్దామనే మంచి శంకల్పంతో ఎస్‌ ఇండియా అనే సంవస్థను స్థాపించి దాని ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్‌ సిప్‌ అందిచారన్నారు. ఈ సేవా కార్యక్రమాలు అక్టోబర్‌ రెండు గాంధీ జయంతి వరకు అన్ని గ్రామాలలో చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ క్రిష్ణ మూర్తి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.