ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ జన్మదిన వేడుకలు శనివారం అర్ధ రాత్రి 12 దాటిన తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నర్సీపట్నం కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు తండోపతండాలుగా రాత్రి 12 గంటలకే ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని పుట్టినరోజు వేడుకలు ప్రారంభించారు. స్థానిక కౌన్సిలర్ కోనేటి రామకృష్ణ, బోడపాటి సుబ్బలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి తదితరులు వేద పండితులతో ఎమ్మెల్యే గణేష్‌కు ఆశీర్వాదాలు అందించారు. గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల ఎమ్మెల్యే కాలికి దెబ్బ తగలడంతో వీల్ చైర్ మీద నుంచే వేడుకలు జరపడంతో కార్యకర్తలు కొంత ఆవేదనకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో రక్తదానాలు, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.










