ప్రజాశక్తి -గోపాలపట్నం : విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గోపాలపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే గణబాబు పేరిట వన్డే బాక్సింగ్ టోర్నమెంట్‌ను ఏర్పాటుచేశారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను గణబాబు సత్కరించారు. ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, కార్పొరేటర్లు దాడి వెంకటరమేష్, పీలా శ్రీనివాసరావు, బొమ్మిడి రమణ, గల్లా చిన్న, రాపర్తి కన్నా, పీవీ నరసింహారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు నందవరపు సోములు, బొడ్డేటి విజరుకుమార్, పొలిమేర సీతారాం, అధికారులు కార్యకర్తలు ఉన్నారు.










