ప్రజాశక్తి - నెల్లిమర్ల : ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు జన్మదిన వేడుకలు మండలంలో తన స్వగ్రామం మోపాడులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బడ్డుకొండకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వైసిపి నాయకులతో కలిసి ప్రజాశక్తి దినపత్రిక వేసిన ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం వైసిపి నాయకులు, నాలుగు మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, వైస్ ఎంపిపిలు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, వివిధ చైర్మన్లు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు సర్పంచులు, ఎంపిటిసిలు శుభాకాంక్షలు తెలుపారు. ప్రతి మండలం నుంచి వైసిపి ఆధ్వర్యంలో కేకులను తీసుకువచ్చి ఎమ్మెల్యే బడ్డుకొండతో కటింగ్ చేయించారు. నాలుగు మండలాల్లో ఉన్న ఎంపిడిఒలు, తహశీల్థార్లందరూ శుభాకాంక్షలు తెలిపారు.
పుట్టిన రోజు వేడుకల్లో దొంగతనం
ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో జేబుదొంగతనాలు జరిగాయి. వేల రూపాయలు నగదు, ఐదు సెల్ ఫోన్లు తష్కరించారు. ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు నియోజకవర్గంలో నాలుగు మండలాలు నాయకులు, కార్యకర్తలు అధికారులు అధికంగా రావడంతో రద్దీ ఏర్పడింది. దీంతో ఇదే అదునుగా భావించిన దొంగలు జనం మధ్యలోకి దూరి వారు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళుతున్నట్టుగా నటించి నాయకులు కార్యకర్తలు జేబులో ఉన్న డబ్బులను సెల్ఫోన్లను కొట్టేశారు. మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌కు చెందిన రూ.50 వేలు నగదును దోచుకున్నారు. మరో నాయకుడుకు చెందిన మరో రూ.10 వేలు దొంగిలించారు. చివరకు విజయనగరానికి చెందిన ఒక వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.
వృద్ధులకు అల్పాహారం, విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ
నెల్లిమర్ల: ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి పుట్టినరోజు వేడుకలు పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గంటా యువసేన ఆధ్వర్యంలో వైసిపి జిల్లా కార్యదర్శి గంటా సత్యనారాయణ (సతీష్) కన్యకా పరమేశ్వరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. పండ్లు పంపిణీ చేశారు. స్థానిక ఆదిత్య విద్యాలయంలో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి కిట్లు అందజేశారు. చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. కేకు కట్ చేసి, వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిలర్ మైపాడ ప్రసాద్, వైసిపి నేతలు రాయల సురేష్, ఇమ్మిడిశెట్టి సతీష్, కృష్ణ మోహన్, పొంతపల్లి పాపారావు, అప్పలరాజు, బూసురోతు శ్రీను, సింగ్ రవి తదితరులు పాల్గొన్నారు.










