
ప్రజాశక్తి-అనకాపల్లి
మూవీ మొఘల్, శతాధిక చిత్ర నిర్మాత డి.రామానాయుడు 87వ జయంతి వేడుకలు అనకాపల్లి పట్టణ వెంకటేష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అనకాపల్లి గవరపాలెం పార్కుసెంటర్ వద్ద మంగళవారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం పేదలకు రగ్గులు పంచిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకుడు పి.చందు మాట్లాడుతూ డి.రామానాయుడు సినిమా ఇండిస్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. భారతీయ భాషాలన్నింటిలో సినిమాలు తీసి గిన్నిస్ బుక్‌కి ఎక్కిన నిర్మాతగా దాదా సాహెబ్ పాల్కే అవార్డ్‌ని అందుకున్న రామానాయుడు కొత్త, పాతతరం నిర్మాతలకు రోల్ మోడల్‌గా నిలిచారన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హాండ్స్ టీం ద్వారా ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆదోని పట్టణానికి చెందిన వెంకటేష్ అభిమాని జ్ఞానేశ్వర్ కుటుంబానికి రూ.75000 వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ వెంకటేష్ ఫాన్స్ అధ్యక్ష, కార్యదర్శులు లాయర్ శ్రీను, బి.రోషన్ కుమార్, కొంగా నాగేశ్వరరావు, గొంతెన వెంకట్, పలివేల రాము, రాయి వెంకట రమణ, రానా ఫాన్స్ టౌన్ ప్రెసిడెంట్ సోమేశ్, పట్టణ ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షుడు జివిఎల్‌ఎన్.రాజు తదితరులు పాల్గొన్నారు.