ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: మండలంలోని ఛందోలు గ్రామంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సయ్యద్ నిజాం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాదిమంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి ఛందోలు గ్రామాన్ని పసుపుమయంగా మార్చారు. బాపట్ల పార్టీ బాధ్యుడు వేగేసిన నరేంద్రవర్మ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కేక్ కటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన వేగేశన నరేంద్ర మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే అన్నారు. వీరి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. ఈ రోజు కార్యక్రమం చూస్తుంటే మినీ మహానాడును తలపించే విధంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం 2 వేల మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీరా, మైనారిటీ పార్లమెంటరీ అధ్యక్షుడు ఖాసీం, మదార్‌బాషా, అన్వర్ సైదా, వెంకట్రావు, కిషోర్‌రెడ్డి, చక్రధర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పీటర్‌పాల్, నరసయ్య, శ్రీనివాసరాజు, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.
రేపల్లె: టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 73వ జన్మదిన వేడుకలు గురువారం పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆదేశాలతో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఆయన మరిన్ని పుట్టినరోజు పండుగలు జరుపుకోవాలని నాయకులు ఆకాంక్షించారు. రాష్ట్రంలో విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబునాయుడు పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకునే విధంగా అటు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇటు విభజన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలను పొందారన్నారు. కార్యక్రమంలో జీవి నాగేశ్వరరావు, జివి రామారావు, మేక పూర్ణచంద్రరావు, పట్టాభి రామారావు మహిళా నాయకులు పాల్గొన్నారు.
భట్టిప్రోలు: టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుక గురువారం భట్టిప్రోలులో ఘనంగా నిర్వహించారు. టిడిపి మండల కమిటీ కన్వీనర్ వాకా శేషుబాబు ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డు సమీపంలో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేపల్లె మాజీ ఎంఎల్‌ఏ ముమ్మనేని వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో నేడు రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపి దిక్కులేని స్థితిలో అభివృద్ధికి ఆమడ దూరంగా ఉందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పెరిగిన గ్యాస్, విద్యుత్ నిత్యావసర ధరలతో అల్లాడుతున్నారన్నారు. ఇచ్చేది 10 రూపాయలు తీసుకునేది 100 రూపాయలుగా పాలన కొనసాగుతోంద న్నారు. ఈ సైకో పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలంతా నడుంబిగించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు రానున్న పుట్టిన రోజును అధికార టీడీపీ పాలనలో జరుపుకునే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ వై కరుణ శ్రీనివాసరావు, నాయకులు జగన్నదరవు, పుణ్య శ్రీనివాసరావు, మాచర్ల నాగరాజు, డోలా శివకుమార్, దీపాల ప్రసాద్, అనగాని ఏడుకొండలు, యడ్ల జయశీల రావు, కనపర్తి సుందరరావు, జంగం శ్యాంసన్, పంచుమర్తి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
సంతమాగులూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా, గురువారం మండలంలోని పుట్టావారిపాలెం గ్రామ సమీపంలో ఉన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అతిథి గృహంలో, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాడిపర్తి వెంకటరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం నాయకులు కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రమేష్, ధూపాటి ఏసోబు, కొనికి శ్రీనివాసరావు, కొనికి గోవిందమ్మ, ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










