Oct 02,2023 00:05

ఘనంగా చంద్రగిరి నియోజకవర్గ వైసిపి ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా చంద్రగిరి నియోజకవర్గ వైసిపి ఆత్మీయ సమ్మేళనం
ప్రజాశక్తి -తిరుచానూరు:తిరుచానూరు సమీపం లోని రామానాయుడు కల్యాణ మండపంలో ఆదివారం చంద్రగిరి నియోజకవర్గ వైసిపి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున రామానాయుడు కల్యాణ మండపం వద్దకు తండోపతండాలుగా చేరుకోవడంతో వేదిక కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి ముఖ్య నేతలు పాల్గొని వైసిపి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డిని ఆశీర్వదిస్తూ ప్రసంగించారుతండ్రికి తగ్గ తనయుడుగా మోహిత్‌ రాజకీయాల్లో రాణించాలని మంత్రి రోజా ఆశీర్వదించారు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఎంతో కష్టపడి పైకి ఎదిగిన వ్యక్తి అని కార్యకర్తగా జెండా మోసి ఈ స్థాయికి వచ్చారని కరుణాకర్‌ రెడ్డి అన్నారు. చిన్న వయస్సులో పెద్ద మనస్సు కలిగిన మోహిత్‌ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని కరుణాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి రెక్కలు కష్టం మీద రాజకీయాల్లో పైకి వచ్చిన వ్యక్తి అని ఎంపీ మిథున్‌ రెడ్డి కితాబిచ్చారు. ఐదేళ్ల క్రితమే మోహిత్‌ రెడ్డి గొప్ప నాయకుడు అవుతాడని ఎమ్మెల్యే చెవిరెడ్డికి చెప్పానని ఇప్పుడు ఇక్కడ వచ్చిన కార్యకర్తలు చూస్తుంటే తనకు మోహిత్‌ విజయానికి ఏ మాత్రం ఢోకా లేదని పిస్తోందని మిథున్‌ రెడ్డి పేర్కొన్నారు.వచ్చే ఎన్నికల్లో మోహిత్‌ రెడ్డిని తప్పక గెలిపిం చాలని మిథున్‌ రెడ్డి కోరారు.ప్రజలకు మంచి చేయడం తప్ప చెడు చేయడం తెలియకుండా తన బిడ్డను పెంచానని వ్యక్తిగా మీరు మెచ్చితే మోహిత్‌ రెడ్డిని ఎమ్మెల్యేని చేయాలని పాలకుడుగా కాదు సేవకుడుగా పనిచేస్తాడని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి అందరికీ కతజ్ఞతలు తెలుపుతూ జగనన్న స్ఫూర్తితో తండ్రి అడుగుజాడల్లో మీ అందరితో కలిసి ముందుకు వెళతానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి ఎంపీ గురుమూర్తి, వైసిపి ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.