Apr 20,2023 19:58

కేక్‌ కట్‌ చేస్తున్న గుడిసె కృష్ణమ్మ, టిడిపి సీనియర్‌ నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఆరేకల్‌ గ్రామంలో కార్యకర్తల మధ్య గురువారం ఘనంగా నిర్వహించారు. టిడిపి సీనియర్‌ నాయకులు గుడిసె కృష్ణమ్మ, మదిరె భాస్కర్‌ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, సౌదీ రావూఫ్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి వన్నెతెచ్చిన ఘనుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. టిడిపి బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, వడ్డేమాన్‌ గోపాల్‌, మల్లికార్జున, బిటి.శ్రీనివాసులు, మల్లేష్‌, శ్రీనివాసులు, హనుమాన్‌, పక్కీరప్ప, బసాపురం శివయ్య స్వామి, నారాయణపురం షేక్షావలీ, ఎడవల్లి యాసీన్‌ బాష, నాయకులు ఉన్నారు.