ప్రజాశక్తి - యంత్రాంగం
టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ సిఎం చంద్ర బాబు పుట్టిన రోజు వేడుకలను జిల్లాలో పలు కేంద్రాల్లో టిడిపి శ్రేణులు కేక్‌లు కట్ చేసి, ఆస్పత్రుల్లో పాలు, పండ్లు పంపిణీ చేసి, పాఠశా లల్లో విద్యార్థులకు భోజనాలు, సిలబస్ మెటీరియల్ అందజేసి ఘనంగా నిర్వహించారు.
పెద్దాపురం సత్తెమ్మ కాలనీలో ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, అనంతరం ఏరియా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. దివిలిలో టిడిపి మండల అధ్యక్షులు కొత్తిం వెంకట శ్రీనివాసరావు (కోటి)ఆధ్వర్యంలో, చంద్రమాంపల్లిలో రేలంగి బుజ్జి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వ హించారు. కాకినాడ కార్పొరేషన్ : కాకినాడలో మాజీ ఎంఎల్‌ఎ వనబడి కొండబాబు ఆధ్వర్యంలో జిల్లా టిడిపి కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం, బలుసు మహర్షి సాంబమూర్తి పాఠశాలలో విద్యార్థులకు ఉచిత భోజన వసతి, కాకినాడ ప్రభుత్వాసుపత్రి వద్ద పేదలకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందజేశారు. గండేపల్లిలో గ్రామ టిడిపి అధ్యక్షులు వెలమాటి కాశి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి వృద్ధులకు, వికలాంగులకు బియ్యం, కాయగూరలు పంపిణీ చేశారు. కోర్పు లచ్చయ్య దొర, పోతుల మోహనరావు, కోర్పు సాయి తేజ, క్లస్టర్ ఇన్‌చార్జ్ బొల్లంరెడ్డి రామకష్ణ, యలమాటి కాశి, జనతా గ్యారేజ్ యూత్ ఇప్పర్ల సురేష్, వెంపాటి సతీష్, పసుమర్తి సుబ్రమణ్యం, దారా కాటయ్య, గుణూరి రాముడు, పిల్లి వెంకటరమణ, వెంపాటి నాని పాల్గొన్నారు. పిఠా పురం కోటగుమ్మం సెంటర్‌లో మాజీ ఎంఎల్‌ఎ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. వర్మాస్ కావ్య ఫౌండేషన్‌లో ఉచిత ఎంసెట్ కోచింగు తరగతులను ప్రారంభించి విద్యార్థులకు మెటిరియల్‌ను అందజేశారు. 600 మందికి అన్నదానం నిర్వహించారు. తాళ్ళరేవు మండల టిడిపిఆధ్వర్యంలో సంతపేట సెంటర్‌లో కేక్ కట్ చేసి ఆసుపత్రిలో పండ్లు మజ్జిగ ప్యాకెట్లు అంద జేశారు. తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ ధూళిపూడి వెంకట రమణ, తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు, టేకుమూడి లక్ష్మణరావు, వుంగరాల వెంకటేశ్వర రావు, కట్టా త్రిమూర్తులు, రోళ్ళ చక్రవర్తి, వెంటపల్లి ఉమామహేశ్వరి, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ హుస్సేన్‌పురంలో గ్రామ టిడిపి అధ్యక్షులు చల్లా బుజ్జి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికి స్వీట్లు పంపిణీ చేశారు. పుప్పాల రాంబాబు, టిడిపి పార ్లమెంటరీ పార్టీ శెట్టిబలిజ సాధికార సభ్యులు పలివెల చంద్రశేఖర్, కోట అప్పారావు పాల్గొన్నారు. శంఖవరం..(అన్నవరం) మండలం కత్తిపూడిలో టిఎన్‌టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు(శివ) ఆధ్వర్యంలో సీతంపేటలో గల రిఫరల్ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు. కీర్తి సుభాష్, పోలం చిన్నా, గొలగాని రాజ్ కుమార్, కంచి బోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు. రౌతులపూడి మండల పార్టీ అధ్యక్షులు తమరాల సత్యనారాయణ. మాజీ ఎంపిపి భాస్కర్‌బాబు. బిసి సెల్ జిల్లా అధ్యక్షులు పైల సాంబ శివరావులు కేక్‌కట్ చేసి అభిమానులకు అందజేశారు.
పెద్దాపురంలో కేక్ కట్ చేస్తున్న ఎంఎల్‌ఎ చినరాజప్ప










