Apr 20,2023 21:09

నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న డోన్‌ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి

ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు


ప్రజాశక్తి-డోన్‌

డోన్‌ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలను డోన్‌ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నాయకులు,కార్యకర్తలతో కలిసి కేక్‌ కటింగ్‌ చేశారు. అనంతరం తెలుగుయువత ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రి నందు బ్రెడ్లు,పండ్లు పంపిణీ చేశారు. పాత బస్టాండులో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఇంఛార్జుల పనితీరులో జోన్‌-5 35 నియోజకవర్గాలలో డోన్‌ 4వ స్థానం రావడంతో వలసల గ్రామ నాయకులు డోన్‌ నియోజక వర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డికి నాయకులు పూలమాలలతో సన్మానించారు. మండలం పార్టీ పని తీరులో కస్టర్‌ పని తీరులో 2వ స్థానం నిలిచినందుకు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్‌ని డోన్‌ నియో జకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి శాలువా,పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ, డోన్‌ నియోజకవర్గ సలహాదారుల కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ గౌడ్‌,నంద్యాల జిల్లా తెలుగుదేశంపార్టీ అధికారప్రతినిధి విజరు భట్‌, నంద్యాల జిల్లా తెలుగుదేశంపార్టీ బిసి సెల్‌ అధ్యక్షులు ప్రజావైద్యశాల మల్లిఖార్జున,డోన్‌ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు,డోన్‌ పట్టణ టిడిపి సమన్వయ కమిటీ చైర్మన్‌ ఆలా మల్లిఖార్జున రెడ్డి,అడ్వకేట్‌ లక్ష్మిశెట్టి క్రిష్ణ ప్రసాద్‌, క్లస్టర్‌ ఇంచార్జి గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు : స్థానిక టిడిపి కార్యాలయంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీనాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్‌ నందు బ్రేడ్లు పంపిణీ చేశారు. పార్టీ సీనియర్‌ నాయకులు వంగాల శివరామి రెడ్డి, కంచర్ల గోవింద రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వేణు గోపాల్‌, మండల అధ్యక్షుడు శివ ప్రసాద్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్లాపురం బాషా, ఫకృద్దిన్‌, రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి నాఘుర్‌ ఖాన్‌, తెలుగు యువత రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ వెన్నా శ్రీధర్‌ రెడ్డి, నంద్యాల జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు సి.కలిముల్లా, నంద్యాల జిల్లా లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి గిరిరాజు, తిరుపతయ్య, శాబుద్దిన్‌, పుల్లా రెడ్డి, రామ కృష్ణ, రమేష్‌ గౌడ్‌, న్యామతుల్లా, చిన్న, అన్వర్‌, ఇరగదిండ్ల మురళి, శివా రెడ్డి, వెంకట్రాముడు, నబీ, సుదర్శన్‌, సుబ్బా రాజు, శరత్‌, ఎస్తేరు, శ్రీనివాసులు, అమ్రుల్లా, మున్నా, జలీల్‌, షఫీ పాల్గొన్నారు.
నందికొట్కూరు టిడిపి నియోజకవర్గం అధికార ప్రతినిధి డాక్టర్‌ కాకరవాడ చిన్న వెంకటస్వామి అధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాల యందు రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. కొత్తపల్లి: మండల కేంద్రమైన కొత్తపల్లిలో ఉన్న సరస్వతి పాఠశాల ఆవరణంలో టిడిపి మండల నాయకులు కెవి శివారెడ్డి నాగ శేషన్న, లింగ స్వామి గౌడ్‌ల ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను చిన్నారుల మధ్య నిర్వహించిచారు. టిడిపి నాయకులు నాగేశ్వరరావు యాదవ్‌, పోత నారాయణ, సుధాకర్‌, పుల్లన్న, శంకర్‌, శ్రీనివాసులు నాయక్‌ పాల్గొన్నారు. బేతంచర్ల: టిడిపి అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్బంగా పాత బస్టాండ్‌ నందు టిడిపి పట్టణ కార్యదర్శి షేక్షావలి చౌదరి,డోన్‌ నియోజకవర్గం గౌరవ సలహాదారులు తిరుమలేశ్‌ చౌదరి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, ప్రజలకు మిఠాయిలు పంచారు. ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర నాయక్‌, ఎం రమేష్‌, కౌన్సిలర్లు రామాంజనేయులు, రామ్‌ గోపాల్‌ ,రామ్మూర్తి, నంద్యాల మధు, ఎస్సీ సెల్‌ మండల కార్యదర్శి సి రాముడు, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వంశి, లోకేష్‌ గౌడ్‌, శ్రీధర్‌, ముళ్ళ, మలిపెద్ది నాగేశ్వర్‌ రెడ్డి, కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. ప్యాపిలి: స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎంపీపీ రాఘవేంద్ర మండల, పట్టణ అద్యక్షులు సుబ్బయ్య, సుంకయ్య ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి మిఠాయి లు పంచి పెట్టారు. మైనారిటీ నాయకుడు ఖాజా పీర్‌,సుదర్శన్‌, కొంగనపల్లి మధు,ధనం మధు,బ్యాంకు శీను,సలాం, ప్రసాద్‌, రాంమోహన్‌ పాల్గొన్నారు. పగిడ్యాల: చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను మండలంలోని నెహ్రు నగర్‌ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. టిడిపి నాయకులు హేమ సుందర్‌ రాజు, రవి చౌదరి, అశోక్‌ నాయుడు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. టిడిపి నాయకులు చాపల వెంకటేశ్వర్లు, రోడ్డు కాటి వెంకటేశ్వర్లు , పకీరయ్య, శ్రీనివాసులు, జనార్ధన్‌, బండారు శ్రీను, గౌడు, జయేంద్ర గౌడు, గడ్డి గోపుల వెంకటేశ్వర్లు, మద్దిలేటి, రామ్‌, అర్లపాటి మద్దిలేటి, రాము టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాగలమర్రి: రాష్ట్ర టిడిపి మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు ముళ్ళ ఆన్సర్‌ బాష ఆధ్వర్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను చాగలమర్రి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర టిఎన్టియుసి అధ్యక్షులు గుత్తి నర్సింహులు, నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్‌ కన్వీనర్‌ నాగరాజు యాదవ్‌, జిల్లా ముస్లిం మైనార్టీ నాయకులు కొలిమి హుస్సేన్‌ వలి, మండల టిడిపి నాయకులు అలంసా గారి మౌలాలి, పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి హనీఫ్‌, తదితరులు పాల్గొన్నారు. పాములపాడు: మండలంలో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టిడిపి తెలుగు యువత రాష్ట్ర నాయకులు మహేష్‌ నాయుడు, టిడిపి మండల అధ్యక్షులు హరినాథ్‌ రెడ్డి, నాయకులు గోవిందు, శివ శంకర్‌ స్వామి, మండల తెలుగు యువత అధ్యక్షులు మధు కృష్ణ, నాయకులు సత్యనారాయణ రెడ్డి, హఫీజ్‌, కృష్ణయ్య హనుమంతు నాయక్‌ కరిముల్ల, లింగ స్వామీ షేక్‌ కరిం బాషా, అది రెడ్డి, చంద్ర, మాబాష పాల్గొన్నారు. గడివేముల: చంద్రబాబు పుట్టినరోజు సందర్బంగా టిడిపి మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎస్సీ సెల్‌ అధ్యక్షులు దామోదరం నాగ శేషులుఆధ్వర్యంలో కేకును కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మండలాధ్యక్షులు వంగాల శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సీతారాం రెడ్డి, టిడిపి నాయకులు బూజునూరు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేశం రమణారెడ్డి, దేశం పుల్లారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. బనగానపల్లె:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 73వ పుట్టిన వేడుకలను గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి ఆదేశాల మేరకు సీనియర్‌ నాయకులు బిసి రామనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేకులు కట్‌ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు. టిడిపి వాణిజ్య విభాగం నంద్యాల పార్లమెంట్‌ అధ్యక్షులు టంగుటూరి శీనయ్య, పట్టణ ఉప సర్పంచ్‌ బురానుద్దీన్‌, మిట్టపల్లి సర్పంచ్‌ తులసి రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఖాసింబాబు, మైనార్టీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు రాయలసీమ సలాం, నాయకులు అన్వర్‌ సాహెబ్‌, టిప్‌ టాప్‌ కలాం, అల్తాఫ్‌ హుస్సేన్‌, బొబ్బల రామ మద్దిలేటి రెడ్డి, వేములపాడు గురప్ప మంగపేట యు.జి. శ్రీనివాసులు, హామ్మద్‌ హుస్సెన్‌, షేక్షావలి, రఫీ, గౌండ బాబు, కార్యకర్తలు, బిసిజెఆర్‌ అభిమానులు పాల్గొన్నారు. అవుకు : మండలంలోని రామాపురం గ్రామంలో టిడిపి మండల అధ్యక్షుడు ఐ.ఉగ్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆళ్లగడ్డ : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను భూమా అఖిలప్రియ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తాలూకా నాయకులు భార్గవ్‌ రామ్‌ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ జెడ్పిటిసి చాంద్‌ బాషా, కౌన్సిలర్‌ హుస్సేన్‌ భాష, నాయకులు సిద్ధి సత్యం, కాంట్రాక్టర్‌ నన్నే బారు గారి జిలాని, నాగంజి పాల్గొన్నారు.