Nov 09,2023 22:57

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ వైసిపి కో-ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ధవళేశ్వరం స్ఫూర్తి చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో వైసిపి దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు, ట్రస్ట్‌ ఛైర్మన్‌ ముత్యాల పోసి కుమార్‌ ఆధ్వర్యంలో గురువారం ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దివ్యాంగులు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌టియుసి జిల్లా అధ్యక్షుడు ముద్దాల అను, వైసిపి నాయకులు ఎస్‌.చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే విఎల్‌ పురం సెంటర్లోని చందన కార్యాలయంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా ఒక విద్యార్థినికి సైకిల్‌ బహుకరించారు.