Aug 22,2023 17:22

ప్రజాశక్తి - భీమడోలు
   బ్లడ్‌ బ్యాంక్‌ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సినీనటులు చిరంజీవి సేవలు ఇతరులకు ఆదర్శప్రాయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. భీమడోలులో చిరంజీవి అభిమానులు, జనసేన కార్యకర్తల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహించారు. దీనిలో భాగంగా కేకును కట్‌ చేసి, మిఠాయిలను పంపిణీ చేశారు. సేవా కార్యక్రమంలో భాగంగా పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పంపిణీ చేయడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను స్వీకరించాలని మొక్కలను తీసుకున్న వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పత్తి మదన్‌, పూజారి రాకేష్‌, సాయి దుర్గాదేవి పాల్గొన్నారు.