Nov 10,2023 21:46

ప్రజాశక్తి - పెనుమంట్ర :
           అంతర్జాతీయ సైన్స్‌ దినోత్సవం రోజున చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహించడం ఇదే మొదటిసారని జన విజ్ఞాన వేదిక జిల్లా సహాయ కార్య దర్శి చింతపల్లి కిరణ్‌ అన్నారు. మండల పరిధిలోని తొమ్మిది హైస్కూల్స్‌ నుంచి సుమా రు 360 విద్యార్థులు చెకుముకి పరీక్ష రాశారు. ఈ పరీక్షను ఎంఇఒ ఉంగరాల నాగేశ్వర రావు పర్యవేక్షించారు. కార్యక్రమాన్ని మండల కన్వీనర్‌ డి.సుధీర్‌ పర్యవేక్షించారు.
భీమవరం రూరల్‌ : అనాకోడేరు డిఎన్‌ఆర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చెకుముకి సైన్స్‌ సంబరాల్లో భాగంగా శుక్రవారం చెకుముకి సైన్స్‌ ప్రతిభా పరీక్షను నిర్వహించారు. బహుమతి ప్రదానోత్సవ సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విఎం.నిర్మలాకుమారి, బి.రాధామణి, ఎన్‌డివి.ప్రసాద్‌, ఎంవి.శ్రీలక్ష్మి, డి.అనురాధ, బికె.రాజేష్‌కుమార్‌రాజు, జి.ఎస్‌.విజయలక్ష్మి, సిహెచ్‌.శ్రీనివాస్‌, జ్యోత్స్న, డి.కనకరత్నం, వై.శకుంతల, ఎం.బాల పల్లాలరాజు పాల్గొన్నారు.