Oct 09,2023 22:20

ప్రజాశక్తి మచిలీపట్నం రూరల్‌ : భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో క్యూబా దేశ విప్లవ కారుడు చేగువేరా 56వ వర్ధంతి కార్యక్రమం సోమవారం మచిలీపట్నంలోని స్టార్‌ కాలేజ్‌ లో ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ సమరం మాట్లాడుతూ క్యూబా దేశ స్వతంత్రం కోసం అనేక ఉద్యమాలు చేసి క్యూబా దేశానికి స్వతంత్ర అందించిన గొప్ప స్వతంత్ర వీరుడు విప్లవకారుడు చేగువేరా వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం ఆనందదా యకం అన్నారు. దేశ స్వతంత్ర ఉద్యమంలో పోరాడు తూనే ప్రపంచానికి ఆలోచన విధానాన్ని, స్వతంత్ర పోరాటాన్ని ,ఉద్యమాన్ని ప్రణాళిక లను అందించే విధంగా ప్రపంచానికి ఆదర్శవంతంగా నిలిచారన్నారు. చేగువేరా ఈరోజు టీ షర్ట్‌ ల మీద బైక్‌ పోస్టర్‌ ల మీద ఒక ఫ్యాషన్‌ హీరో లాగా చూస్తున్నారని యువకులు అర్థం చేసుకునే విధంగా ఆయన జీవితం ఉంది.కానీ ఆయన విప్లవ వీరుడు,క్యూబాలో వైద్యుడిగా అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల స్వేచ్ఛ స్వతంత్రం కోసం ఆయన పోరాడిన విధానాన్ని నేటి యువతీ,యువకులు తెలుసుకోవాలని,ఆస్మానే వ్యాధితో బాధపడుతున్నా స్వతంత్ర ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనాన్ని పోరాడే తత్వాన్ని అందించిన మహావీరుడు అమెరికా సైన్యానికి బందీ అయి వారి హింసకాండకి తన ప్రాణాలను అర్పించిన విప్లవీరుడు చేగువేరా తన ఆశయాన్ని ముందు తీసుకెళ్తామని ఆయన కలలు కన్న స్వప్నాన్ని నెరవేరుస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సుఖేష్‌ ,జిల్లా సహాయ కార్యదర్శి రాజేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కీర్తి, స్టార్‌ కాలేజ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.