ఘనంగా చార్లెస్ రాబర్ట్ డార్విన్ వర్ధంతి
ప్రజాశక్తి-డోన్
ప్రముఖ పరిణామ వాద సిద్ధాంత కర్త,జీవ శాస్త్రవేత్త చార్లెస్ రాబర్ట్ డార్విన్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయురా లు పద్మావతమ్మ,సీనియర్ ఉపాధ్యాయులుఎం.వెంకటసుబ్బారెడ్డి లు తెలిపారు.బుధవారం డోన్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతపేట నందు చార్లెస్ రాబర్ట్ డార్విన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డార్విన్ జీవజాలం ఏ విధంగా పరిణామ క్రమంచెందినది అనే విషయంపై పరిశోధనలు చేసి,జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడని తెలిపారు.ప్రకృతిలో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముతూ వస్తున్న ప్రజానీకానికి అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని తెలియజేశారన్నారు.ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని మొట్టమొదటి సారిగా వివరించినవాడు చార్లెస్ డార్విన్ మాత్రమే అని కొన్నియాడారు.ప్రకృతిలో జీవజాతులు తమ ఉమ్మడి పూర్వీకుల నుంచి క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడ్డాయని డార్విన్ వివరించాడని ఈ సిద్ధాంతం సర్వత్రా ఆమోదం పొందిందని విజ్ఞాన శాస్త్రంలో ఇది ఒక మౌలికమైన భావనగా భావిస్తారని డార్విన్ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో జన్మించాడని వైద్యుడైన తండ్రి అన్ని సదుపాయాలూ సమకూర్చినా చదువులో రాణించలేదని చురుకైన విద్యార్థిగా గుర్తింపు లేదని అతను చిన్ననాటి నుండి కీటకాలను,ఖనిజాలను సేకరిస్తూ రసాయనిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ ఉండేవాడని జీవుల్ని ఏదో అతీత శక్తి ఏకకాలంలో సృష్టించలేదని, అవి వివిధ దశల్లో ప్రకృతి వరణం ద్వారా పరిణామం చెందాయని డార్విన్ సిద్ధాంతం చెబుతుందని అన్నారు.చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుందని ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చిందని మూఢ నమ్మకాలని విభేదించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించిందని 1831 లో విజ్ఞాన శాస్త్ర పరిశోధనల నిమిత్తం యురోపియన్ దేశాలను చుట్టిరావటానికి బయలు దేరిన బీగల్ సముద్ర నౌకలో నేచురలిస్ట్ గా ప్రయాణం చేసే అవకాశం డార్విన్ కి లభించిందని పేర్కొన్నారు.1868 లో డార్విన్ "ది వేరియేషన్ ఆఫ్ ఆనిమల్స్ అండ్ ప్లాంట్స్ అండర్ డొమెస్టికేషన్" అనే పుస్తకాన్ని ప్రచురించాడని, ఈయన 74 యేండ్ల వయస్సులో 19.4.1882న చనిపోయారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శివ ప్రసాద్,వెంకట రమణ వెంకటేశ్వర్ గౌడ్,రవిశేఖర్,వెంకటలక్ష్మీ, సుబ్బారెడ్డి,లక్ష్మయ్య,చంద్రశేఖర్ గౌడ్,రాధ,మ ద్దిలేటి,మధుసూదన్ రెడ్డి,శివన్న,శ్రీనివాసులు, జయసుబ్బారాయుడు,సంజీవరెడ్డి, ఆదినారాయణ, లీలావతమ్మ, శ్రీకళ, సంజీవరెడ్డి, దేవేంద్రప్ప భాను ప్రకాష్ రెడ్డి, భారతి, రామ్మూర్తి , రాఘవేంద్ర,లక్ష్మి ప్రభావతి,మునిరాజు,అల్లిపీరా తదితరులు పాల్గొన్నారు.










