Oct 03,2022 00:00

భీమ జ్యుయలరీ షోరూంను ప్రారంభిస్తున్న నటి నిక్కీ గల్రానీ

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : విశాఖ నగరంలోని ఆశీల్‌మెట్ట సంపత్‌ వినాయక టెంపుల్‌ వద్ద భీమ జ్యుయలరీ షోరూం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటి నిక్కీ గల్రానీ, భీమ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ బి.గోవిందన్‌తో కలిసి ఈ షోరూంను ప్రారంభించారు. దేశంలోనే అత్యంత విశ్వసనీయ నగల దుకాణాల్లో తామున్నామని, అందమైన, అధునాతన డిజైన్లలో బంగారు ఆభరణాలు తమ వద్ద లభ్యమవుతాయని భీమ గ్రూప్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ జయ గోవిందన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర మేనేజింగ్‌ డైరెక్టర్లు గాయత్రి సుహాస్‌, సుహాస్‌ ఎంఎస్‌, దీపాకపూర్‌, సుధీర్‌ కపూర్‌, ఆరతి గురురాజ్‌, గురురాజ్‌ పాల్గొన్నారు. విశాఖలో భీమ స్టోర్‌ను ప్రారంభించడంలో భాగంగా గ్రూప్‌ తన వినియోగదారులకు గ్రాండ్‌ ప్రారంభోత్సవ ఆఫర్లను ప్రకటించింది. ఈ కార్యక్రమం అనంతరం నిక్కీ గల్రానీ చేతుల మీదుగా ప్రజాశక్తి ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజాశక్తి విశాఖపట్నం బ్రాంచి మేనేజర్‌ ఎం.వెంకటేశ్వరరావు పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.