Sep 28,2023 22:53

ప్రజాశక్తి - భట్టిప్రోలు
భగత్ సింగ్ 116వ జయంతిని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి యుటిఎఫ్ మండల కార్యదర్శి వై సురేష్ పూలమాలవేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సూచించారు. తెల్ల దొరల పాలన నుండి భారతదేశ విముక్తి కోసం 23ఏళ్ల వయసులోనే భగత్ సింగ్ పోరాటాలు కొనసాగించారని గుర్తు చేశారు. విద్యార్థులు ఆయన స్ఫూర్తితో పని చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా అధ్యక్షులు పి మనోజ్, మండల అధ్యక్ష, కార్యదర్శులు మొహిదీన్, జగదీష్ ఉన్నారు.