Jan 18,2023 22:42

నృత్యం చేస్తున్న గిరిజనుడు, తిలకిస్తున్న స్థానికులు

ప్రజాశక్తి-పెదబయలు
మండలంలోని కిముడుపల్లి గ్రామంలో భారీజం పండగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ముడు సంవత్సరములకు ఒక్కసారి కిముడుపల్లి పంచాయతీ ప్రజలు కిముడుపల్లి గ్రామంలో ఈ పండుగ అనాదిగా నిర్వహిస్తున్నారు. గ్రామ సావడి వద్ద పాట పాడుతూ బ్రిటీష్‌ కాలంనాటి పూర్వీకుల ఆయుధాలకు పూజలు నిర్వహించారు. వీటిని ప్రదర్శన చేసి వాటి వివరాలు యువతకు తెలియజేస్తారు. అనంతరం సావడిలో ఆయుధాలతో విన్యాసాలు చేస్తారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో గుమ్మలట, దింసా, భజన వంటి అనేక రకాలైన సాంస్కతి కార్యక్రమాలు, ప్రత్యేక వేషాధారణతో ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనలో గెలుపొందిన వారికి ప్రధమ, రెండవ, ముడవ బహుమతులను గండేరు. నిరీక్షణరావు ఆర్థిక సహాయంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో కోడా సింహాద్రి, గండేరు రంగాావు, కోడా.కృష్ణ ముర్తి, చింతడ. శ్రీరాంమర్తి, కొడా వరహానంధం, కిముడు శివలింగం నాయుడు, ఆనంద్‌ పాల్గొన్నారు.