May 05,2023 23:57

దిబ్బడిలో బుద్ధుని విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-అనకాపల్లి
వైశాఖి పౌర్ణమి సందర్భంగా గౌతమ్‌ బుద్ధుని 2567వ జయంతి వేడుకలు సిద్దార్థ సోషల్‌ సర్వీస్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బల్లా నాగభూషణం ఆధ్వర్యాన సబ్‌ జైల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి సబ్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ వైఎన్‌.గణేశ్‌ రెడ్డి బుద్ధుని చిత్ర పటానికి పూలమాల వేసి క్యాండీల్స్‌ వెలిగించి పూజలు చేశారు. ఖైదీలకు బుద్దుని భోధనలు, సమాజానికి మార్గ దర్శకాలు అన్న అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు, మెడల్స్‌ అందజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు బల్లా నాగభూషణం, ప్రతినిధులు వినకోట నీలేశ్‌ గుప్తా, అల్లాడ శ్రీనివాసరావు, రొబ్బి మల్లేశ్వర రావు, పట్నాల కృష్ణ మోహన్‌, మైలపల్లి నూకరాజు, కాసారపు సత్యనారాయణ పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : బుద్ధుని బోధనలు నేటి సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయని మాజీ ఎంపిటిసి గోన్నాబత్తుల శ్రీనివాసరావు అన్నారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా మండలంలోని దిబ్బిడి గ్రామంలో గల గౌతమ బుద్ధిని విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. శాంతి సహనం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ చిన్ని పైడిరాజు, పెదరెడ్ల రాజు, తదితరులు పాల్గొన్నారు