
ప్రజాశక్తి-ఉక్కునగరం : తెలంగాణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఉక్కునగరం సీ భవన్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఉక్కు చీఫ్ జనరల్ మేనేజర్ (వర్క్స్) ఇంఛార్జి ఎన్‌వి.స్వామి, డబ్లుఎండి, ఎస్‌ఎంఎస్ -1 విభాగాధిపతులు కె.రవిశేఖర్, పి.శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మ సంబరాలు జరపడం హర్షణీయం అన్నారు. మహిళలు బతుకమ్మ పాటలతో ఆడి పాడి సందడి చేశారు. రంగు రంగు పూలతో అలంకరించిన బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ సందడి చేయడం ఆహుతులను ఆకట్టుకుంది. సంఘం అధ్యక్షులు ఎన్.కుమారస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జి.ఆనంద్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకటేశ్వర్లు, ప్రతినిధులు జి.మల్లేశం, ఎన్.నర్సింగరావు, టి.ప్రభాకర్, సిహెచ్.రవికుమార్, ఆర్.నర్సింహా, బానోత్ గణేష్, జె.శ్రవణ్‌కుమార్, అధికారులు ఎన్.వీరేశం, పి.శంకర్, ఎ.శంకర్ తదితరులు పాల్గొన్నారు.