పజాశక్తి- ఉలవపాడు :మండల కేంద్రమైన ఉలవపాడులో బక్రీదు సందర్భంగా గురువారం స్థానిక ఈద్గా వద్ద ముస్లిములు వేడుకలు నిర్వహించారు. మౌలానా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు బక్రీదు శుభాకాంక్షలు తెలిపారు.
పొదలకూరు : స్థానిక ఈద్గా ప్రాంగణంలో పండుగ బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని ముస్లీం సోదరులంతా సాంప్రదాయ దుస్తుల్లో ప్రార్ధనలో పాల్గొన్నారు. ముస్లిం మత గురువు మౌలానా ముస్తక్ మదని సందేశమిచ్చారు.
నెల్లూరు : దర్గామిట్ట సమీపంలోని బారాషాహిద్ దర్గా ప్రాంతంలో బక్రిద్ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ముస్లీం మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. వైసిపి రూరల్ నియోజకవర్గ సమన్వయ కర్త , ఎంపి. ఆదాల ప్రభాకర్‌రెడ్డి సూచనల మేరకు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఈ ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొని, ముస్లీం మైనార్టీ సోదరులకు బక్రీద్ శుభాక్షాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినాన్ని ముస్లీం మైనార్టీ సోదరుల మద్య నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. కార్పొరేటర్లు సత్తార్, వైసిపి నాయకులు షేక్ రియాజ్, యాకసిరి శరత్‌చంద్ర, సిహెచ్ హరిబాబు యాదవ్, ఏసునాయుడు, మౌల, ఖలీల్, ఆలీమ్ , సిహెచ్ సూరి పాల్గొన్నారు.










