ప్రజాశక్తి-కందుకూరు : ఉపాధ్యాయుడు బి.వి.రమణ పుట్టుకతోనే సేవాభావం అలవర్చుకున్నారని ఎంఎల్‌శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ జనార్ధన స్వామి ఆలయంలో శ్రీరామగిరి భ్రమరాంబ సుబ్బారావు కళ్యాణమండపంలో ఆదివారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు, ప్రాణ, యోగ, ధ్యాన శిక్షణ గురువు, అమ్మ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు బి.వి.రమణ, సులోచన దంపతుల షష్టిపూర్తి మహోత్సవం వైభవంగా జరిగింది. బి వి రమణ దంపతులను శాసనసభ్యులు మహీధర్ రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎంఎల్‌ఎ మహీధర్ రెడ్డి మాట్లాడుతూ బి వి రమణకు పుట్టుక నుంచే సేవాభావం అల వడిం దన్నారు. ఏ కార్యక్రమంలోనైనా తన వంతు సాయం అందిస్తూ వస్తున్నారన్నారు. భర్తకు తగిన భార్యగా సేవ చేయడంలో ఆమె ఎప్పుడూ బివి రమణకు సహకరిస్తూ ఉంటారన్నారు. పుట్టేటప్పుడు ఎవరూ తీసుకొని రారు, పోయేటప్పుడు ఎవరూ తీసుకుని పోరు అనే సామెతను ప్రతి ఒక్కరూ గుర్తించుకుని తనకు ఉన్న దానిలోనే తోటి వారికి సాయం చేస్తూ ఉండాలన్నాఉ. అలాంటి సేవా భావం కలిగిన వ్యక్తి బి వి రమణ అని కొనియాడారు. బి వి రమణ దంపతులు మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఎంఎల్‌ఎ ఆకాంక్షించారు. రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి వల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ బి వి రమణ లాంటి సేవా భావం కలిగిన వ్యక్తి నాయి బ్రాహ్మణులలో ఉండటం అదృష్టమన్నారు.తన షష్టిపూర్తి మహోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అమ్మ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సమాజ సేవకులకు సేవ రత్న పురస్కారాలను అందజేశారు. కందుకూరు ఎంఇఒ 2 సుబ్బారెడ్డి, వలేటివారిపాలెం జడ్పిటిసి ఇంటూరి భారతి, జనార్ధనస్వామి ఆలయ చైర్మన్ రావులకొల్లు బ్రహ్మానందం ఉన్నారు.










