ఘనంగా బీసీ ఉద్యోగుల మహాసభ
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
రాష్ట్ర బీసీ ఉద్యోగుల మహాసభ తిరుపతి నగరంలో ఆదివారం ఘనంగా జరిగింది. తిరుపతి నగర పరిధిలోని నరసింహ తీర్థం మార్గంలో గల ఆఫీసర్స్ క్లబ్ బి సి ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర బీసి ఉద్యోగుల మహాసభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వంకీపురం పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహాసభకు దాదాపు 1000 మంది బిసి ఉద్యోగులు హాజరైనట్లు వెల్లడించారు. మహాసభలో తీర్మానాలను ప్రవేశపెట్టి, సభకు హాజరైన వారిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శివపూర్ణయ్య, ప్రధాన కార్యదర్శి బట్టా భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీహరి, డిఆర్‌ఓ వెంకటనారాయణ, సీనియర్ వైద్యులు ఆలా వెంకటేశ్వర్లు, విజిలెన్స్ అధికారి నారాయణ, అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ సుబ్రమణ్యం, ఎక్సైజ్ ఉద్యోగి శ్రీనివాసులు, ఎస్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ పాల్గొన్నారు.










