Oct 01,2023 20:41

చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన బిఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు

ప్రజాశక్తి-విజయనగరం :  భారత సంచార నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌) 24వ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఆ సంస్థకార్యాలయంలో ఘనంగా జరిగింది. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ డి.దాలినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ జన మేనేజర్‌ శ్రీనివాసరావు, మురళీధర్‌ జగదీష్‌తో పాటు బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. డిజిఎం దాలి నాయుడు తొలుత కేకును కట్‌ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిఎస్‌ఎన్‌ఎల్‌ అభివృద్ధికి అందరూ సహకరించాలని, వినియోగదారులకు నాణ్యమైన సర్వీసులు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మొదట బహుమతి పొందిన వారికి 4జి సిమ్‌కార్డ్‌ ఏడాది కాలపరిమితితోను, రెండో బహుమతి పొందిన విద్యార్థికి 6 నెలలు కాల పరిమితితో, తృతీయ బహుమతి పొందిన విద్యార్థికి మూడు నెలలు కాలపరిమితితో పనిచేసే 4 జి సిమ్‌ను అందజేశారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రంతో పాటు 75 మంది విద్యార్థులకు 4జి సిమ్‌లు అందజేశారు. కార్యక్రమంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి అలుగు వెంకట్రావు, ఎన్‌ఎఫ్‌టిఇ జిల్లా కార్యదర్శి అప్పారావు, బిటిఇయు కార్యదర్శి మాలిక్‌ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బిఎస్‌ఎన్‌ఎల్‌కు వెంటనే 5జి సర్వీసులు ఇవ్వాలని అలుగు వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు.