Nov 14,2023 21:49

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ప్రకాష్‌


కడప రూరల్‌ : కడప నగరం సాయిపేటలోని ఎస్‌విఆర్‌ హైస్కూల్‌లో విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మంగళవారం బహుమతులు అందజేశారు. గత సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, ఎస్‌ఎస్‌సి పబ్లిక్‌ పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు సిల్వర్‌ మెడల్‌, రూ.వెయ్యి నగదు బహుమతిగా అందజేశారు. బహుమతులను సుగావాసి, చిట్టెం ఫ్యామిలీ తరఫున ప్రకాష్‌ చేతుల మీదుగా ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్‌విఆర్‌ హైస్కూల్‌ కరస్పాండెంట్‌ ఆవుల సుధాకర్‌, ప్రధానోపాధ్యాయులు కాటిబోయిన సురేష్‌, ఎఒ నిరంజన్‌రెడ్డి, గణిత ఉపాధ్యాయులు నాగేంద్ర, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కడప అర్బన్‌ : హెలెన్‌ కెల్లర్‌ బదిలీల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలల దినో త్సవాన్ని పురస్కరించుకొని చాచా నెహ్రూ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ పి. దేవలత్‌ ఖాన్‌, ప్రిన్సిపల్‌ మసూదా బేగం పూల మాల వేసి నివాళులర్పించాఉ.ప కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అల్‌ షిఫా మానసిక దివ్యాంగ పునరావాస కేంద్రంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం వ్యవస్థాపకులు రఫీ, ప్రిన్సిపల్‌ విద్యార్థులు ఉపా ధ్యాయులు పాల్గొన్నారు. సాయిబాబా స్కూల్‌లో.. బాలల దినోత్సవం సంద ర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్ర రెడ్డి, కార్పొరేటర్‌ ఎం.వి. శ్రీదేవి, వైస్‌ చైర్మన్‌ సాయి సుధీర్‌ కుమార్‌ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో.. భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ 134వ జన్మదినోత్సవ వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నగర అధ్యక్షులు వై. విష్ణు ప్రీతం రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. నెహ్రు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్‌, మైనార్టీ విభాగపు రాష్ట్ర ఉపాధ్యక్షులు పఠాన్‌ మహమ్మద్‌ అలీఖాన్‌, రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్య క్షులు కొపూరి శ్రీనివాసులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్యామలమ్మ, యువజన కాంగ్రెస్‌ పార్టీ సమాచార హక్కు చట్టం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి లక్ష్మయ్య, నేషనల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా జిల్లా అధ్యక్షులు మామిళ్ళ బాబు, కదిరి ప్రసాద్‌ గౌడ్‌, సూర్యం, హరి పాల్గొన్నారు. వికాస్‌ ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌లో.. బాలల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్కూల్‌ కరస్పాండ్‌ వికాస్‌ హరికష్ణ జవహర్‌ లాల్‌ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వివిధ పోటీలలో బహుమతులు సాధించిన విద్యా ర్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్కూల్‌ హెడ్మాస్టర్‌ హమీద్‌, ప్రిన్సిపల్‌ ఫాతిమా నజ్రిన్‌, స్కూల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ స్వర్ణలత పాల్గొన్నారు కాశినాయన : చదువుకుంటున్న పిల్లలు అంటే జవహర్‌ లాల్‌నెహ్రూకు ఎంతో ఇష్టమని ఆకుల నారాయణపల్లె ఎంపిపి స్కూల్‌ ప్రధానో పాధ్యాయులు, ఎస్‌టియు జిల్లా కౌన్సిల్‌ సభ్యులు సుబ్రహ్మణ్యం తెలిపారు మంగళవారం ఎంపిపి పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సహోపాధ్యాయుడు రమణారెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు చెన్నూరు: గ్రంథాలయ నిర్వాహకులు కె . హరి కష్ణ ఆధ్వ ర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వల్లూరు: స్థానిక శ్రీ యాదాల శేషగిరి మెమోరియల్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో మంగళవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌, ఏవో ఉత్తమ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అట్లూరు : శాఖా గ్రంథాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ అధికారి ఎం సుధాకర్‌ అధ్యక్షతన ఉపాధ్యాయులు విద్యార్థులు అట్లూరులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో 30 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు గౌరీ శంకర్‌, రమేష్‌ యాదవ్‌ వెంకట సుబ్బయ్య, వెంకటయ్య పాల్గొన్నారు. పోరుమామిళ్ల : స్థానిక గ్రంథాలయంలో నెహ్రు జయంతి, గ్రంధాలయ వారోత్సవాల కార్యక్రమం, లైబ్రేరియన్‌ ఆఫ్రిది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. మొదట నెహ్రు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ మార్కా రెడ్డి హాజరయ్యారు. ఈనెల 20 వరకు నిర్వహించే గ్రంధాలయ వారోత్సవాలలో పాల్గొన్న పిల్లలకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజ ేస్తామన్నారు. కార్యక్రమంలో ఆలమూరి వెంకట స్వామి, ఖదీర్‌, ప్రసాద్‌, కె. సిద్దయ్య పాల్గొన్నారు. చింతకొమ్మదిన్నె : స్థానిక గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి పి.ఇబ్రహీం ఆధ్వర్యంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు, బాలల దినోత్సవం సందర్భంగా ఎంఇఒ రమాదేవి, వైద్యులు రాఘవేంద్రరావు, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం గంగాధర్‌ ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేంపల్లె : నేటి బాలలే రేపటి భవిష్యత్తుకు వెలుగు దివ్వెలని ఉషాకిరణ్‌ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్‌ బిఎస్‌ రమణారెడ్డి అన్నారు. స్థానిక ఉషాకిరణ్‌ పాఠశాలలో మంగళవారం పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు. పలువురు విద్యార్థుల దేశ నాయకుల వేషధారణలో అలరించారు. గ్రంథాలయాల ద్వారా జ్ఞానోదయం పొందవచ్చని గ్రంథాలయ అధికారి వనజాకుమారి కోరారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయులు ఆంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దువ్వూరు : శాఖా గ్రంధాలయంలో మంగళవారం వారోత్సవాలు ప్రారంభి ంచారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి దువ్వూరు సర్పంచ్‌ చంద్రాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రంధాల యాధికారి శ్రీనివాసరావు, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాపాడు : చాపాడు శాఖ గ్రంథాలయంలో మంగ ళవారం గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పండిత్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి శివశంకర్‌రెడ్డి, సచివాలయ ఉద్యోగులు జానకి, ఉర్దూ హైస్కూల్‌ ఉపాధ్యా యులు అజీజ్‌ అహ్మద్‌, బిడిసి రవిశంకర్‌ రెడ్డి, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మైదుకూరులో.. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా భారత మెదటి ప్రధాని నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. పలు పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్ర మంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) : జవహర్‌ లాల్‌ నెహ్రు జయంతిని మంగళవారం స్థానిక రాజీవ్‌ స్కూల్‌లో చైర్మన్‌ ఎవి రాజేష్‌, కరస్పాండెంట్‌ ఎం. సుధాకర్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎల్‌కెజి నుండి 10వ తరగతి విద్యార్థుల వరకు ఎఫ్‌ఏ-2లో మంచి ఫలితాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. జ్ఞానాన్ని పెంపొందించడానికి గ్రంధాలయాలు చాలా ఉపయోగపడతాయని డిప్యూటీ ఇఒ జి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక పుట్టపర్తి నారాయణ ఆచార్యుల ప్రధమ శ్రేణి గ్రంథాలయంలో జాతీయ గ్రంథా లయ వారోత్సవాల ప్రారంభోత్సవంలో ఆయనతోపాటు అనిబిసెంట్‌ మున్సిపల్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రప్ప, వైవిఎస్‌ పాఠశాల ప్రధానో పాధ్యాయులు కాశీపతి రెడ్డి, ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత గజ్జల వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎంపీపీ స్కూల్‌ హౌమాస్‌పేట హెచ్‌ఎం రవీంద్రరావు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత సాహిత్య వేత్త జింక సుబ్రహ్మణ్యం, స్కూల్‌ హెచ్‌ఎం రవీంద్రుడు, జన విజ్ఞాన వేదిక కన్వీనర్‌ అరవీటి చంద్రశేఖర రావు, ప్రథమ శ్రేణి గ్రంథాలయ అధికారి టి.తిరుపతమ్మ పాల్గొన్నారు. సింహా ద్రిపురం : గ్రంధాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గ్రంధా లయ స్థలదాత వీరారెడ్డి కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి కోరారు. సింహాద్రిపురం గ్రంథాలయంలో వారోత్సవాల సందర్భంగా మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించి ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ అధికారి శేఖర్‌, జడ్పీ హైస్కూల్‌ పీడీ రామకృష్ణారెడ్డి, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.