
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ : బాలల దినోత్సవం సందర్భంగా నగరంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో ఆక్స్‌ఫర్డు స్కూల్‌లో ఉత్తమ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. చదువుతో పాటు క్రమశిక్షణ తదితర అంశాల్లో ఉత్తమంగా నిలిచిన డి.గోవర్ధన్, జాహ్నవి, కె.ఎల్.ప్రసన్న, కె.యామిని, సిహెచ్ సోమశ్రీ, జి.సాయి రోహిత్, బి.లలిత్ కిరణ్, బిజెఎస్ కిరణ్మయి, పి.యు వి.పద్మిని, జి. మోహన్ కృష్ణలను ఉత్తమ విద్యార్థి పురస్కారంతో సత్కరించారు. ఎస్‌పి జి.ఆర్.రాధిక ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులను అభినందిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుతో పాటు మంచిగా ఆటలు ఆడుతూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించు కోవాలని సూచిం చారు. ఈ సందర్భంగా విజయనగరానికి చెందిన అంధుల సంస్థకు పాటశాల విద్యార్థులు రూ.21,500 లను ఎస్‌పి చేతుల మీదుగా వితరణ చేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌లు ఎ.రమేష్ బాబు, ఎ.లావణ్య రాణి, ప్రిన్సిపాల్ బి.కిరణ్ కుమార్‌లతో పాటు కో-ఆర్డినేటర్‌లు దీప కుమారి, దేవి, విజయలతో పాటు తల్లి తండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలల దినోత్సవాన్ని పురష్కరించుకుని న్యూ శ్రీకాకుళం బ్లడ్‌బ్యాంకు ఆధ్వర్యాన తలసేమియా, హెచ్‌ఐవి, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మంగళవారం నగరంలోని 80 అడుగుల రోడ్డులో బృందావన్ హాల్లో నిర్వహించిన ఈశిబిరాన్ని ఎఎస్పి (క్రైమ్) టిపి విఠలేశ్వరరావు, నగర మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఐసిడిఎస్ పిడి బి.శాంతిశ్రీలు ప్రారంభించారు. ముందుగా నెహ్రు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వివిధ స్వచ్చంద సంస్థల సహకారంతో చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ (డ్రై ఫ్రూట్స్, గ్లూకోజ్, ప్రోటీన్ పౌడర్) పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు డిఎంహెచ్‌ఒ డాక్టరు ఎన్.అనూరాధ, డ్రగ్ కంట్రోల్ అధికారి ఎం.చంద్రరావు, న్యూ బ్లడ్ బ్యాంకు మేనేజరు డా. తొత్తడి మణికంఠరావు, శాసపు జోగి నాయుడు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్, లైన్స్ క్లబ్ హర్షవల్లి ప్రెసిడెంట్ హారిక ప్రసాద్ పాల్గొన్నారు.
గాంధీ మందిరం స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనంలో నిర్వహించిన కార్యక్రమంలో విగ్రహదాత లోలుగు మదన్మోహన్, మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొగిరి సుగుణాకరరావు, డాక్టర్ జామి భీమశంకర్, బరాటం లక్ష్మణరావు, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, పొన్నాడ రవికుమార్, మహిబుల్లాఖాన్, హారికా ప్రసాద్ పాల్గొన్నారు.
ఆమదాలవలస : నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్ పౌరులని పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. మంగళవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఆమె స్వగృహంలో చిన్నారులతో కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. చిన్నారులకు మిఠాయిలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌విఎస్ స్కూల్ కరస్పాండెంట్ పేడాడ వైకుంఠరావు, ప్రిన్సిపాల్ పేడాడ శ్రీధర్ (బుజ్జి), కాంగ్రెస్ నాయకులు లఖినేని నారాయణరావు, బస్వా షణ్ముఖరావు, పప్పల వెంకటరమణ, లఖినేని సాయిరాం, బొత్స రమణ, దాలయ్య, అప్పారావు, శ్రీరాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బూర్జ: మండలం చీడివలస గ్రామంలో ఎంపియుపి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ జన్మదిన విశిష్టత, బాలల దినోత్సవం ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, సూర్యనారా యణ, శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
రణస్థలం రూరల్: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి కొత్తకోట్ల సింహాద్రి నాయు డు, కె.లక్ష్మీ, వై.సూర్యనారాయణ, ఎం.గణేష్ పాల్గొన్నారు.
ఫోటో: మాట్లాడుతున్న సింహాద్రి నాయుడు
పొందూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లోలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బ్రెడ్స్ సంస్ధ ఆధ్వర్యంలో కైలాష్ సత్యార్ధి చిల్డ్రన్ ఫౌండేషన్ సౌజన్యంతో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే భవిత కేంద్రంలో బాలల దినోత్సవం ఘనంగా జరిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరావు, భవిత కేంద్రం సహిత ఉపాధ్యాయులు రాధారాణి, దినేష్, ఫిజియోథెరిఫీ రమ్య, ప్రియాంక పాల్గొన్నారు. మండలంలో కింతలి ఎంపిపి పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి పైడి నాగభూషణరావు, చిన్నారులకు మిఠాయిలు, చాక్లెట్లు పంపిణీ చేశారు.
జి.సిగడాం: మండలంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, అద్దనంపేట ప్రాథమిక పాఠశాల, ఆదర్శ పాఠశాల, కెజిబివి, పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా జాతీయ బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ కోరుకొండ కృష్ణారావు, ప్రధానోపాధ్యాయులు అరుణకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం అర్భన్: నగరంలోని ట్వింకిల్ కిడ్స్ స్కూల్లో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ పాల్గొని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ట్వింకిల్ కిడ్ స్కూల్ యాజమాన్య ప్రతినిధులు రాధా, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
మెళియాపుట్టి: మండలంలోని పలు పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. బాలల దినోత్సవం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గొప్పిలి, కరజాడ, పెద్దమడి, పిఎల్ పురం, పెద్ద పద్మాపురం, బందపల్లి, చాపర తదితర ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో పలు ప్రైవేటు విద్యాసంస్థల్లో బాలల దినోత్సవ కార్యక్రమం జరిగింది.
సంతబొమ్మాళి : జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకుని బోరుభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు టి.లోకేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయులు జి.జగదాంబ, బి.శ్రీనివాసరావులను సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సందేశాత్మక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి.ఉమాశంకర్, వెంకటరెడ్డి, కె.త్రినాథరావు, బాడాన రాజు, డి.ఉమాదేవి, కె.రమణమ్మ, టి.విజయలక్మి పాల్గొన్నారు.
కవిటి: ఉషోదయ యువజన సంఘం ఆధ్వర్యాన కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఎంపిపి పాఠశాల, కుసుంపురం, కవిటి బివికె, ఎస్వీజె విద్యా సంస్థలు, కల్యాణి ఆంగ్ల, జగతి, నెలవంగ జిల్లా పరిషత్ ఉన్నత, నెలవంక ప్రాథమిక పాఠశాలల్లో బాలల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఉషోదయ యువజన సంఘం అధ్యక్షుడు పాండవ చంద్రశేఖర్, సభ్యులు ఆరింగి మధు, పొల్లాయి లక్ష్మణమూర్తి, పులకల వెంకటరావు, భావన రవి పాల్గొన్నారు.
టెక్కలి : మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుక మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. మెయిన్ రోడ్డు ప్రాథమికోన్నత బజారు పాఠశాల ఆవరణలో ఉన్న నెహ్రూ విగ్రహానికి డిసిసి అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లౌకికవాదం విధానాన్ని అభివృద్ధి చేసింది నెహ్రూ అని గుర్తు చేశారు. విద్యార్థులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోత మధుసూదనరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్నూరు ఆనందరావు, హెచ్‌ఎం ఎం.బాలయ్య, ఆర్.సూర్యకుమారి, చైర్మన్ బర్ల అపర్ణ పాల్గొన్నారు.
మండలంలోని నరసింగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచహెం అనురాధ, విలియం వాక్యాన్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.మధులత, రవీంద్ర భారతి పాఠశాల ఆవరణలో పద్మజ ఆధ్వర్యాన బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ముందు గా నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలల దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ తెంబురు గోవిందమ్మ నెహ్రు చిత్రపటానికి పూలమాలల్ వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఓ.కోటేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, ఎస్.దుర్గారావు, వై.రమేష్ పాల్గొన్నారు. అలాగే స్థానిక ఓక్లాండ్ పాఠశాల ప్రిన్సిపాల్ మళ్లా మధులత ఆధ్వర్యాన నిర్వహించిన బాలల దినోత్సవంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని ఆకట్టుకున్నాయి.
నౌపడ : దండు గోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్‌ఛార్జి హెచ్‌ఎం వీరభద్రరావు ఆధ్వర్యాన బాలల దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు చేసిన జానపద నృత్యాలు అందరినీ ఆకట్టకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరరావు, లక్ష్మీకాంతం పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం : స్థానిక జ్ఞాన భారతి విద్యా సంస్థలో కార్యదర్శి జోహర్‌ఖాన్ ఆధ్వర్యాన బాలల దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన మినీ బజార్ స్టాల్‌లు ఆకట్టుకున్నాయి. స్వర్ణభారతి విద్యా సంస్థలో చైర్మన్ చాట్ల తులసీదాస్‌రెడ్డి, శాంతి నికేతన్ విద్యా సంస్థలో చైర్మన్ దక్కత కృష్ణమూర్తి, భవానీపురం అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త నరసమ్మ ఆధ్వర్యాన బాలల దినోత్సవం నిర్వహించారు.
కొత్తూరు : ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవంలో తూర్పుకాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్ పాల్గొన్నారు. అలాగే కెజిబివి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బెడ్స్ సంస్థ కైలాష్, సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ అధ్యక్షులు జి.జగన్నాథరావు, సర్పంచ్ పడాల కృష్ణవేణి, ఎంపిటిసి జి.తర్నకుమారి, హెచ్‌ఎంలె ఎ.గోవిందరావు, ప్రసాదరావు, గోగుల వరప్రసాదరావు నాయుడు, జి.ఆనందరావు, పి.లక్ష్మణరావు, కె.శ్రీరాములు, ఉషారాణి, రమణమ్మ, జ్యోతి పాల్గొన్నారు.
ఎచ్చెర్ల : మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎల్‌ఐసి ఉద్యోగి టేకి ఆచారి ఆధ్వర్యాన బాలల దినోత్సవం నిర్వహించారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఎంపిటిసి బగ్గు రాజారావు, ప్రకాష్, నందీశ్వరరావు, శశి, రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మెహర్ విద్యా విహార్‌లో...
శ్రీకాకుళం : పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పి.ఎన్ కాలనీలోని మెహర్ విద్యా విహార్‌లో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విశ్రాంత జెసి పి.రజనీకాంతరావు పాల్గొన్నారు. 'ప్రజాశక్తి' నిర్వహించిన ప్రత్యేక బాలల సంచికను ఆవిష్కరించి అందరికీ కాపీలను అందజేశారు. కరస్పాండెంట్ వి.కామేశ్వరరావు, డైరెక్టర్ బరాటం లక్ష్మణరవు, డి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.