Nov 14,2023 21:49

పార్వతీపురం : దేశనాయకుల వేషాధారణలో గాయత్రి స్కూల్‌ విద్యార్థులు

ప్రజాశక్తి విలేకర్లు :  భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జన్మదినాన్ని పురష్కరించుకొని జిల్లాలో పలు చోట్ల బాలల దినోత్సవాలు నిర్వహించారు. పాఠశాలల్లో, ప్రైవేట్‌ సంస్థల్లో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల విద్యార్థులచే ర్యాలీ, దేశ నాయకుల వేషాధారణలు చేపట్టారు.
కురుపాం : ఎస్‌ సొసైటీ ఆధ్వర్యంలో మండలంలోని మాదలింగి జిల్లా పరిషత్‌ పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవానికి ప్రముఖ కవి, రచయిత గంటేడ గౌరునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువు అంటే కేవలం పుస్తకాలు చదవడమే కాదని, ఆటలు, పాటలు, చిత్ర లేఖనం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విద్యలో భాగమేనని అన్నారు. విద్యార్ధులు మొబైల్‌ ఫోన్‌కు దూరంగా ఉండి పుస్తకానికి దగ్గర అవ్వాలని కోరారు. అనంతరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు, ఎస్‌ సొసైటీ కార్యదర్శి గౌస్‌ , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రంలో...
మండల కేంద్రంలో గల అంగన్వాడి కేంద్రం - 3లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఒ కె.విజయగౌరి బాలల దినోత్సవం గూర్చి, పిల్లల పెరుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి ఐసిడిఎస్‌ ద్వారా అందిస్తున్న సేవలు అన్ని సక్రమంగా సమయానికి అందించాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు వివి రమణమ్మ, శ్రావణి, గౌరి, అంగన్వాడీ కార్యకర్తలు జె.సరోజ, శోభారాణి, సూర్య కుమారి పాల్గొన్నారు.
దేశ నాయకుల వేషధారణలో గాయత్రి స్కూల్‌ విద్యార్థులు
పార్వతీపురం టౌన్‌ : పట్టణంలోని గాయత్రి స్కూల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బాలల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పాఠశాలలో ఉన్న పలువురు విద్యార్థులు దేశ నాయకులు జవహర్లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, ఝాన్సీరాణి, భారతమాత, తదితర వేషధారణలు స్కూల్‌ కరస్పాండెంట్‌ పివికె మణికుమార్‌తో పాటు ఉపాధ్యాయులను, స్థానికులను ఆకట్టుకున్నాయి.
పాలకొండ: మండలంలోని ఓని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవం నిర్వమించారు. పాఠశాల హెచ్‌ఎం బలగ నాగమణి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోగుల సూర్యనారాయణ, పాలవలస శారదాకుమారి, సిద్ధాబత్తుల వెంకటరమణ, కుదమ తిరుమలరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
వీరఘట్టం : మండలంలోని బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంబరవలస పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎం.పైడిరాజు ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీతంపేట : మండలంలో పెద్దూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ హెచ్‌ ఆదిలక్ష్మి. హెచ్‌ఎం ప్రసాద్‌, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు నెల్లి సత్యం నాయుడు పాల్గొన్నారు. అలాగే సీతంపేట బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు లిల్లీరాణి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని దిగుమండ ఎంపిపి పాఠశాలలో బాలల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు నిమ్మక సింహాచలం పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గిరిజన విభాగం అధ్యక్షులు కిల్లక రాఘవేంద్రరావు, నాయకులు బిడ్డిక సూర్యం, మూటక లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
సాలూరు: బాలల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాలలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ కోడూరు సాయి శ్రీనివాసరావు ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాద్యాయులు నెహ్రూకు నివాళి అర్పించారు.
పాచిపెంట : బాలల దినోత్సవం సందర్భంగా పాచిపెంట సరస్వతీ శిశు మందిర్‌ చిన్నారులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో గ్రామ పురవీధుల్లో చిన్నారులు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.