మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు వేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పలు చోట్ల విద్యార్థులకు వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.
ప్రజాశక్తి - జామి
పిల్లలకు పుస్తకాలతో మానసిక ఉల్లాసం కలగడంతో పాటు సమాజ అవగాహన కలుగుతుందని ఎంఇఒ గంగరాజు అన్నారు. యాతపాలెం ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం, గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ప్రజాశక్తి ముద్రించిన 52 పేజీల పిల్లల ప్రత్యేక సంచిక చిరు మువ్వలు, అమ్మ చెప్పిన కథల పుస్తకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపా ధ్యాయులు జెవిఆర్‌కె ఈశ్వరరావు, ఉపాద్యాయులు పి సంతోషమ్మ, ఆర్ వెంకటరావు పాల్గొన్నారు.
గరివిడి: మండలంలోని రామలింగాపురం ప్రాథమికొన్నత పాఠశాలలో బాలల దినోత్సవం, గ్రంథాలయ వారోత్సవం ఘనంగా నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయులు వావిలపల్లి మోహన్ రావు, గొర్లె రమణ హాజరై గేయాలతో పిల్లలలో ఉత్సహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి ముద్రించిన చిరుమువ్వలు అనే సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు గొర్లె పద్మావతి, పాల్గొన్నారు. బొబ్బిలి : పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలల హక్కులను కాపాడాలని వైసిపి పట్టణ అద్యక్షులు చోడిగంజి రమేష్, కౌన్సిలర్లు కె.పెదరాములు, ఎస్.రామకృష్ణబాబు కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డెంకాడ: మండలంలోని అక్కివరం ఏపీ మోడల్ స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాచరచన, నృత్యాలు, డిబెట్, పద్యాలు, పాటల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ సంధ్య బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. వేపాడ: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలోనూ, వసతి గృహాల్లోనూ బాలల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫ్లోరెన్స్, ఎస్‌ఒ కిరణ్మయి, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ ఈశ్వరరావు, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు, సి ఆర్ పి లు పాల్గొన్నారు.శృంగవరపుకోట : పట్టణంలోని సుబ్బిరామిరెడ్డి కల్యాణ మండపం ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడి బంగారనాయుడు నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పూడి శ్రీనివాసరావ, నియోజకవర్గ కో అర్డినేషన్ సభ్యులు హెచ్ నానాజీ, మెంటాడ అప్పారావు, జిల్లా ఆదివాసి అధ్యక్షులు చీమల అచ్చిబాబు, పాల్గొన్నారు. నెల్లిమర్ల: స్థానిక ఆదిత్యా విద్యాలయంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ డాక్టర్ పివివి సూర్యనారాయణ రాజు పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు, వివిధ క్రీడారంగంలోనూ విద్యారంగంలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఎమ్మెల్సీ చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ వి. సూరిబాబు, హెచ్‌ఎం అమృత, పాల్గొన్నారు. బాడంగి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంచార్జ్ హెచ్‌ఎం వెంకటలక్ష్మి నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాల్గొన్నారు .రామభద్రపురం: నాయుడు వలస పాఠశాలలో హెచ్‌ఎం నాగభూషణం ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు, కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జేసీ రాజు సమక్షంలో విద్యార్థులు శాంతికి సూచనగా తెల్ల బెలూన్లను ఎగురవేశారు. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు రెడ్డి వేణు, రాజ శేఖర్, బొప్పే రవి కుమార్, కృష్ణం నాయుడు, దాలినాయుడు పాల్గొన్నారు.బొండపల్లి: మండలంలోని కనిమెరక ప్రాథమిక పాఠశాలలో మంగళవారం న్యాయవాదులు నెహ్రూ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా పిల్లలకు మిఠాయిలు, బిస్కెట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాపాక సాయి సురేష్, పొట్నూరు శ్రీను, కొల్లూరు సాయి శేఖర్, హెచ్‌ఎం, సిబ్బంది పాల్గొన్నారు. గంట్యాడ: మండలంలోని లక్కిడాం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు వాక చిన్నంనాయుడు ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేసలపు నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వంగర: స్థానిక శాఖా గ్రంథాలయం, వివిధ గ్రామాల అంగన్వాడి కేంద్రాలు, వివేక్ మాస్టర్ మైండ్స్ పాఠశాలలో మంగళవారం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి బివి రమణమూర్తి, సూపర్‌వైజర్ రజిని, దుర్గ, ప్రధానోపాధ్యాయులు బి ఈశ్వరరావు, వెంకటపతి, పాల్గొన్నారు. విజయనగరంటౌన్ : జెఎన్‌టియుజివిలో నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ యూనిట్, స్పార్క్ సొసైటీ, సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. వెంకటసుబ్బయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. జయ సుమ, విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ప్రొఫెసర్ ఎం. శశిభూషణ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గుర్నాథ్, స్పార్క్ సొసైటీ వ్యవస్థాపకులు పి వి. పద్మనాభం,ఎన్‌జిఒ ప్రెసిడెంట్ పి. భవాని పాల్గొన్నారు. విజయనగరం కోట: దేశానికి దిశా దశ నిర్దేశించేది బాలలేనని లెప్రసీ మిషన్ హీల్ ప్రాజెక్ట్ ప్రతినిధి తలాడ దీప్తి అన్నారు. లెప్రసీ మిషన్, హీల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో చెల్లూరు లోని ఎంపి యుపి స్కూల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో హెచ్‌ఎం వై. రాము, సిడిఒ వంశీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజయనగరం టౌన్: బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జనసేన నాయకులు గురాన అయ్యలు అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జొన్న గుడ్డి నగరపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు, చాక్లెట్లు అందజేశారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు రాజేష్ , వజ్రపు నవీన్ కుమార్ , ఎమ్.పవన్ కుమార్, అభిలాష్ పాల్గొన్నారు.