Nov 14,2023 17:37

బాలల దినోత్సవ వేడుకల్లో చిన్నారులు

ప్రజాశక్తి - వలేటివారిపాలెం : మండలంలోని బడేవారిపాలెం ఎంపిపి స్కూలు, అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం బాలల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎంపిపి స్కూల్లో జవహర్లాల్‌ నెహ్రూ చిత్రపటానికి హెచ్‌ఎం మాలకొండయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెహ్రూ వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. డ్యాన్సు తదిత సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రంలో ఐసిడిఎస్‌ అధికారులు చిన్నారులచే కేక్‌ కట్‌ చేయించి దేశ నాయకుల వేషధారణలు వేయించారు. సిడిపిఒ శర్మిస్ట, సూపర్‌వైజర్‌ సునీత, హెచ్‌ఎం మాలకొండయ్య అంగన్‌వాడీ కార్యకర్తలు మనోహర రాదా భారతి తదితరులు ఉన్నారు.