ప్రజాశక్తి-పాడేరు:మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి పూలమాలు వేసి ఆయన సేవలను కొనియాడారు.
.పాడేరులోని కలెక్టర్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఏ కార్యాలయంలో సబ్ కలెక్టర్, ఇన్‌చార్జి పిఓ వి. అభిషేక్ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసారని కొనియాడారు. ఉత్తమ పార్లమెం టేరియన్‌గా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నాయకుడన్నారు. సబ్ కలెక్టర్ , ఇన్‌చార్జి పిఓ వి.అభిషేక్ మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రామ్ చెప్పిన మాటలు తనకు ఎంతో ఇష్టమన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఎల్‌డిఎం రవితేజ, పౌర సరఫరాల డిఎం బి. గణేష్, ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి వి.ఎస్ ప్రభాకరరావు, డిఎస్‌ఓ ఎల్.అప్పారావు, కలెక్టర్ కార్యాలయం అధికారులు, ఐటిడిఏ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
చింతూరు:దేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ 116వ జయంతి వేడుకలు చింతూరు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం అనుసూచిత్ జాతి సంక్షేమ సంఘం అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం జాతీయ కన్వీనర్ చదలవాడ కృప కుమార్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ నేత, సామాజిక సంస్కరణ వాది అయిన జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం కృషి చేశారని తెలిపారు. భావితరాలు ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి ఎం.తాతాజీరావు, పూసా శ్రీను, చీదర గడ్డ శేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.
రాజవొమ్మంగి : జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు స్థానిక ఎమ్మార్పీఎస్ కమిటీ సమావేశ మందిరంలో మాదిగ పోరాట సమితి అధ్యక్షులు మోర్త బుజ్జిబాబు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలిత జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం.బుజ్జిబాబు, పిల్లి కిరణ్, పెద్దాడ నూకరాజు, బాడపాటి కామరాజు, అయినవిల్లి యెహౌను, గండేపల్లి చిన్నఆప్పారావు, గండేపల్లి జీవరత్నం, కొండబాబు పాల్గొన్నారు.










