
ప్రజాశక్తి-రావికమతం:మేడివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్, ప్రత్యేక ఉపాధ్యాయుడు మహాలక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఆటిజం అవగాహన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు నాగమణి మాట్లాడుతూ, దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలను, సేవలను ఉచితంగా అందిస్తుందన్నారు. ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు నాగమణి, ఉపాధ్యాయులు రమణాజీ, జయప్రభ, మాధవి, విశ్వనాథం చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మి నాయుడు, జగన్నాథ నాయుడు, ఉపాధ్యాయులు అన్నపూర్ణ, విజయ, పద్మావతి శ్రీనివాస్, బ్రహ్మాజీ పాల్గొన్నారు.