కేక్‌ను కట్ చేస్తున్న అనిత
ప్రజాశక్తి -ఎస్.రాయవరం:టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు శుక్రవారం అడ్డురోడ్డులో పార్టీ నాయకులు, కార్యకర్తల ఘనంగా నిర్వహించారు. అడ్డురోడ్డులో ఉన్న ఆభయాంజనేయ స్వామిని అనిత దర్శించుకుని ఆలయం నుండి ర్యాలీగా ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పీలా గోవింద సత్యనారాయణ,, మాడుగుల టీడీపీ ఇంఛార్జి పివిజే కుమార్ పాల్గొన్నారు.










