Aug 13,2023 00:01

వినుకొండ: పట్టణ యువత శనివారం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లోకల్‌ టూ గ్లోబల్‌ అనే అంతర్జాతీయ కార్యక్రమం ద్వారా, టి డి హెచ్‌ అనే జర్మనీ అంతర్జాతీయ స్వచ్ఛంద సం స్థతో, ఆర్‌ ఎల్‌ హెచ్‌ పి మైసూర్‌ వారి తోడ్పాటుతో స్వచ్ఛంద సేవా సంస్థ హ్యాండ్స్‌ ఆఫ్‌ కంపా షన్‌ వారి సహకారంతో యువతే ముఖ్యఅతిథులుగా యువజన దినోత్సవ బ్యానర్‌, కరపత్రిక ఆవిష్కరణ చేశారు. అనంతరం యువత మొక్కలు పెంచడం, ప్లాస్టిక్‌ నిషేధం, నీటిని జాగ్రత్తగా వాడటం మొదలైన కార్యక్రమాలు చేయ డం అలవర్చుకోవాలంటూ ప్లే కార్డ్స్‌ చేతబూని,కరపత్రికలను పంచుతూ పెద్ద ఎత్తున పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. వ్యాపారస్తుల వద్దకు వెళ్లి పూర్తిగా ప్లాస్టిక్‌ నిషేధించాలని , రైతుల వద్దకు వెళ్లి సేంద్రీయ ఎరువులనే వాడాలని వారికి అవగాహన కల్పించారు. అలాగే శ్రీకృష్ణవేణి డిగ్రీ కళాశాల యువతకు వ్యాసరచన పోటీలు, సామూహిక గ్రూపు చర్చలు, ఉపన్యాసాలు మొదలగు కార్యక్రమాలను యువత ద్వారా సంస్థ నిర్వహించింది. అత్యుత్తమ ప్రతిభ కనపరచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కళాశాల ప్రిన్సిపాల్‌ యోగి చేతుల మీదుగా అందజేశారు. తదనంతరం కళాశాల ప్రాంగణంలో యువతే మొక్కలు నాటారు. అనంతరం సంస్థ వారు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న షెడ్యూల్‌ తెగల కాల నీలు అయిన చీకటీగలపాలెం,అరుంధతి కాలనీ, హనుమాన్‌ నగర్‌, డ్రైవర్స్‌ కాలనీ, మసీదుమాన్యం, కాలనీలోని యువత తో విభిన్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో కష్ణవేణి డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్‌ యోగి,కళాశాల అధ్యాపకులు, సంస్థ సిబ్బంది విద్యారావ్‌, ఆశా, సంధ్య, షాహీదా, కొండలు పాల్గొన్నారు.