Oct 05,2023 23:06

ఉపాధ్యాయులను సన్మానం చేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి - అమలాపురం రూరల్‌
స్థానిక శ్రీ వెంకటేశ్వరా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల కరస్పాండెంట్‌ కెవిఆర్‌ఎన్‌.నరసింహారావు, ప్రిన్సిపల్‌ కె.మనోహర్‌, వైస్‌ చైర్మన్‌ కరాటం ప్రవీణ్‌, ఎమ్‌డి కె.శ్రావణ్‌దిలీప్‌ యాలంగి వరప్రసాద్‌, చోడే జాన్‌ పాల్‌, బి.శ్రీనివాస్‌, డాక్టర్‌ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, కరాటం సూరిబాబు తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంసౌన్‌, ఎం.రోషిణి, ఎం.పార్వతి, అనురాధ, సత్యశ్రీ, సూర్యకుమారి, కవిత, రత్నవాణి, స్నేహిత, దివ్య, నాగరాజు, కె.వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.