ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
రెడ్‌క్రాస్ ఎఎన్‌ఎం మహిళ శిక్షణ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్‌పర్సన్ బొమ్మారెడ్డి పద్మజావాణి హాజరై తొలుత ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మజా వాణి మాట్లాడుతూ నర్సుల వృత్తికే వన్నెతెచ్చి, వైద్య రంగంలో విశేషమైన సేవలందించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని ఆమె గౌరవార్థం ప్రతిఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటూ, ఈ రంగంలో సేవలు అందించిన నర్సులను సన్మానిస్తామని తెలిపారు. కరోనా విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి నర్సులు అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఎఎన్‌ఎం నర్సింగ్ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ శిక్షణ అనంతరం మహనీయులను ఆదర్శంగా తీసుకుని సేవా భావంతో పనిచేయాలని కోరారు. అనంతరం ఎంతోమంది నర్సింగ్ విద్యార్థినులను తీర్చిదిద్దుతున్న కళాశాల ప్రిన్సిపల్ వై.డేబోరా, ట్యూటర్లు జి.జ్ఞానవేణి, సిహెచ్.అనూష, ఎ.ప్రియాంకాలను పద్మజావాణి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్ కార్యదర్శి బి.బెన్నీ, కమిటీ సభ్యురాలు వై.ఉమావాణి, కళాశాల ప్రిన్సిపల్ వై.డెబోరా, జి.జ్ఞానవేణి, సిహెచ్.అనుష, ఎ.ప్రియాంక, ఎ.సూర్యనారాయణ, మహమ్మద్, సుధీర్ పాల్గొన్నారు.
ఏలూరు టౌన్ :ప్రతి నర్సింగ్ ఉద్యోగి నర్సింగ్ వృత్తికే వన్నెతెచ్చిన ఫ్లారెన్స్ నైటింగేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని రోగులకు మంచి సేవలు అందించాలని అసిస్టెంట్ మలేరియా నివారణ అధికారి జె.గోవిందరావు సూచించారు. స్థానిక ఏలూరు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ పవర్‌పేటలో వైద్యాధికారి డాక్టర్ ప్రత్యూష ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సింగ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ఫ్లారెన్స్ నైటింగేల్ దయతో, ప్రేమతో రోగులకు సేవలందించారన్నారు. ఇప్పటి ఉద్యోగులు నైటింగేల్ మాదిరిగా సేవలందించి వైద్య శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. అసిస్టెంట్ మలేరియా నివారణ అధికారి గోవిందరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 12వ తేదీన నైటింగేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వైద్య, ఆరోగ్య శాఖకు మంచి పేరు తీసుకురాy ాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఎల్‌టి.దినరాజ్, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.
మండవల్లి : వైద్యం అందించడంలో నర్సులు పాత్ర ఎంతో ఉందని సర్పంచి మెండ జాన్సీ అన్నారు. ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రోగికి వైద్యం అందించడంలో డాక్టర్ల కన్నా నర్సుల పాత్ర ఎంతో ఎక్కువన్నారు. అనారోగ్యంతో వచ్చిన రోగిని ప్రేమతో పలకరించడంలోనూ, వైద్య సేవలను అందించి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి పంపించడంలో నర్సులకు సాటి ఎవరూ రారన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాఫ్ నర్సులు యేసు కుమారి, పి.నగీనలను దుశ్శాలువలతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్లు అనిలా, జి.సుమ, సిహెచ్‌ఒ శ్రీనివాసరావు, ఎఫ్‌ఎన్‌ఒ నవీన, మెండ సురేష్‌బాబు పాల్గొన్నారు.










