Mar 08,2023 23:49

సిఐటియు, ఐద్వా, యుటిఎఫ్‌ ఆధ్వర్యాన ప్రదర్శన నిర్వహిస్తున్న మహిళలు

ప్రజాశక్తి- విలేకర్ల బృందం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అనకాపల్లి జిల్లాలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల కేక్‌లు కట్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సత్కరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
అనకాపల్లి : స్థానిక రింగ్‌ రోడ్‌లోని వైసిపి కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కేక్‌ కట్‌ చేసి పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ బివి సత్యవతికి తినిపించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ బివి సత్యవతి, వైసిపి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఈర్లె అనురాధ, అనకాపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పలక యశోద, ఎంపిపి గొర్లి సూరిబాబు, వైసిపి మహిళ నాయకులు పాల్గొన్నారు.
టిడిపి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో గవరపాలెం పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి పార్టీ మహిళా నాయకురాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ మాదంశెట్టి చిన్న తల్లి, తెలుగు మహిళ నాయకులు కొణతాల రత్న కుమారి, సేనాపతి స్వరూప, శంకర్ల పద్మలత, కాయల ప్రసన్న కుమారి, ఉడత పద్మ, అమరావతి, సూర్యప్రభ, సీరంశెట్టి వెంకటలక్ష్మి, దేవి, టిడిపి నాయకులు మాదంశెట్టి నీలబాబు పాల్గొన్నారు.
కశింకోట : మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా కుర్చీ ఆటలు, పాటలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎంఎంఎస్‌ అధ్యక్షులు కె అరుణ, కార్యదర్శి అప్పలనరసమ్మ, కోశాధికారి లక్ష్మి, ఏపిఎం ఎస్‌.శ్రీనివాసరావు, అనురాధ, నిర్మల, సత్యనారాయణ, రామకృష్ణ, వాణి సర్పంచ్‌ మళ్ళ మణి, గొర్లి ఉమ, మళ్ళ పార్వతి పాల్గొన్నారు.
మండలంలోని ఉగ్గిన పాలెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కశింకోట మండల పరిషత్‌ అధ్యక్షురాలు కలగా లక్ష్మి మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్నింటిలోనూ ముందుండాలన్నారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని సూచించారు. అనంతరం పాఠశాల చైర్మన్‌ బుదిరెడ్డి కుమారికి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కలగా గున్నయ్యనాయుడు, విఓబి కలగా పద్మ, విఆర్‌పి ఎద్దు చిన్నారి, అమరిపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు.
చోడవరం : అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా విశ్వశాంతి పొదుపు సంఘం ఆధ్వర్యంలో మహిళలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్రాంతి వైస్‌ ఛాన్సలర్‌ ఎం ముత్యాల నాయుడు మహిళా దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. శ్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్క్‌ డైరెక్టర్‌ డిఎస్‌ ప్రసాద్‌, శ్రీ విముక్తి సంఘటన నాయకులు ఓవిఎస్‌ లక్ష్మి, రెడ్డిపల్లి అప్పలరాజు, రిటైర్డ్‌ లెక్చరర్‌ ఎన్‌ దేవుడు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని సీతయ్యపేటలో ఎంపీపీ దాకారపు నాగేశ్వరి దేవికి ఆర్‌.శివ రాం పురం మాజీ సర్పంచ్‌ బోయిన నారాయణ మూర్తి, వైసీపీ నాయుకులు కుంచం ప్రకాష్‌రావు, యలమర్తి వాసు, కొడమంచిలి ముసిలి నాయుడు, ఎన్నెం శెట్టి నాయుడు, నందవరపు రాజు బాబు, సామాజిక కార్యకర్త ఆకుల నాగేశ్వరరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. బుచ్చయ్యపేట మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గ్రామైక్య సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం బాలరాజు సమాజంలో స్త్రీ యొక్క పాత్రను వివరించారు.
సబ్బవరం : మండలంలోని జాగృతి స్వచ్ఛంద సంస్థ ఎమ్‌డి కందర్ప సుజాత ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ మహిళలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జాగృతి సంస్థ ద్వారా రుణాలు పొంది పలు రంగాల్లో రాణించిన మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ మహిళా న్యాయవాది రజని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రస్తుత రోజుల్లో మహిళలపై సైబర్‌ వేధింపులు అధికంగా ఉన్నాయని, మహిళలు దిశా యాప్‌, నిర్భయ చట్టం, దిశా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జాగృతి సీఈఓ కెఎల్‌ఎన్‌ మౌక్తిక ఆధ్వర్యంలో నిర్వహించిన పలు నృత్యాలు, షార్ట్‌ ఫిల్మ్‌, పలు విప్లవ గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జాగృతి సంస్థ అధ్యక్షులు కోటిని అమ్మతల్లి నాయుడు, ఉద్యానవనశాఖాధికారి జి.రాధిక, నాబార్డు డీడీఎం శ్రీనివాసరావు, గొట్టివాడ సర్పంచ్‌ సాలాపు మీనా, ఆశా జ్యోతి, సంస్థ సిబ్బంది రమేష్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌ : నేటి మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతూ అత్యున్నత ప్రతిభ కనబరచడం అభినందనీయమని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్‌ బివి సత్యవతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని నాగులపల్లి గ్రామంలో చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్‌ ధ్యాన కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ తల్లిగా, సోదరిగా, భార్యగా కుటుంబంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అనంతరం ధ్యాన కేంద్రంలో సాధన చేస్తున్న పలువురు మహిళలు ఆమెను శాలువలతో సన్మానించారు. ధ్యాన గురువు సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.
కొత్తకోట : మహిళా దినోత్సవం వేడుకలు రావికమతం మండలం కొత్తకోటలో బుధవారం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా చోడవరం నియోజకవర్గం టిడిపి మహిళా అధ్యక్షురాలు, కొత్తకోట మాజీ సర్పంచ్‌ కోట నీలవేణి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా మహిళా అధ్యక్షులు దిమిలి జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కోరుకొండ సంతోషి, రాజేష్‌, బాబ్జి, శ్రీను పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌ :పట్టణంలో మహిళా దినోత్సవం, హౌలీ పండుగ ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్‌ స్టేడియంలో నింజాస్‌ అకాడమీ ఆధ్వర్యంలో హౌలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ''అంతర్జాతీయ మహిళా దినోత్సవం'' సందర్భంగా విద్యార్థులతో పట్టణ ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో నింజాస్‌ అకాడమీ చైర్మన్‌ వెలగా నారాయణరావు, కోచ్‌ శేఖర్‌, వివిధ పాఠశాలల విద్యార్థులు, అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు.
కోటవురట్ల : మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వెలుగు కార్యాలయంలో ఏపీ రమణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పోటీల్లో డ్వాక్రా మహిళలు పాల్గొని సంస్కతిక కార్యక్రమాలు, పలు రకాల గేమ్‌లు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
పాయకరావుపేట : పట్టణంలోని శ్రీ చైతన్య, కనోస ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో శ్రీ చైతన్య ప్రిన్సిపాల్‌ మాణిక్యాలరావు, ఏజీఎం సురేషు, ఆర్‌ఐ గోపీనాథ్‌, విజరు, ఏవో విజరు, ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్‌ గౌరీ, ప్రైమరీ ఇంచార్జ్‌ రమ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
నక్కపల్లి : నక్కపల్లి వైసీపీ కార్యాలయం వద్ద బుధవారం కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ రత్నం, జడ్పిటిసి కాసులమ్మ, మాజీ సర్పంచ్‌ కల్పనలను సత్కరించారు. వైసిపి నాయకులు ఈశ్వరరావు , కొప్పిశెట్టి హరిబాబు, తళ్ళ భార్గవ్‌, గంటా తిరుపతిరావు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
యస్‌.రాయవరం : అడ్డురోడ్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళలకు సన్మానం చేశారు. పార్టీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు రమా కుమారి, జిల్లా కార్యదర్శి లాలం కాశీ నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్దం, అనకాపల్లి జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజుల, నర్సీపట్నం జెడ్‌పిటిసి రమణమ్మ పాల్గొన్నారు.
మండలంలోని సర్వసిద్ధి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద మెడికల్‌ ఆఫీసర్లు శక్తి ప్రియ, వాసంతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆరోగ్య విస్తరణాధికారి నాగేశ్వరరావు, సత్యనారాయణ, హెల్త్‌ విజిటర్‌ రమణ, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ క్లినిక్‌ క్లస్టర్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.
మహిళల్లో సామాజిక, రాజకీయ చైతన్యం అవసరం
అనకాపల్లి : మహిళల్లో సామాజిక, రాజకీయ చైతన్యం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని ప్రముఖ వైద్యులు జి.యామిని కుమారి అన్నారు. స్థానిక దొడ్డి రాము నాయుడు కార్మిక కర్షక నిలయంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల హక్కుల సాధన కోసం, స్త్రీ పోరాటాలకు భారత దేశం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూ 1908లో స్త్రీ ఉద్యమ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడిందన్నారు. స్త్రీ పురుష వ్యత్యాసానికి వ్యతిరేకంగా కనీస వేతనాలు, కనీస హక్కుల కోసం నేటి మహిళలు అనేక ఉద్యమాల్లో ముందుంటున్నారని తెలిపారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి మాట్లాడుతూ స్త్రీలలో చైతన్యం తమ ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దుర్గారాణి, మజ్జి నాగశేషు, వివోఏల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సిహెచ్‌.రూపదేవి, మధ్యాహ్న భోజన పథకం యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు ప్రసన్న, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి సూర్యకళ తదితరులు ప్రసంగించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలి వరకు ర్యాలీ చేశారు.