Oct 11,2023 21:58

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
                స్థానిక శ్రీ పొట్టిశ్రీరాములు పురపాలక సంఘం ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్‌ ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ బాలికలు కలిసికట్టుగా ఐకమత్యంగా ఏ సమస్య వచ్చినా తమ గళాన్ని వినిపించాలన్నారు. ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. వివిధ పోటీల్లో గెలుపొందిన బాలికలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖాధికారి బి.సుజాతారాణి, జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.వెంకటరమణ, తహశీల్దార్‌ వై.రవికుమార్‌, హెల్త్‌ ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ జి.సుగుణరాజు, ప్రధానోపాధ్యాయులు జె.సుధారాణి, ఐసిడిఎస్‌ ఇఒ సిహెచ్‌.సుజాతాలక్ష్మి, ఉపాధ్యాయులు, ఐసిడియస్‌ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఆడపిల్ల ఇంటికి కళ అని జిటిపి మహిళ కళాశాల బిఇడి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎ.ధనలక్ష్మి అన్నారు. భీమవరం జిటిపి మహిళ కళాశాలలో శ్రీవిజ్ఞానవేదిక అధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఇడి ప్రిన్సిపల్‌ పి.జొహన్నా, శ్రీభారతి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ ఉపాధ్యాయులు వి.పద్మ, నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడారు. అనంతరం బాలికలతో ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.ఉషా, ఎస్‌.నాగేశ్వరరావు పాల్గొన్నారు. భీమవరం బ్రౌనింగ్‌ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ డి.మహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్రౌనింగ్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు, యుపిహెచ్‌సి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రఫీ, జిల్లా హెల్త్‌ ఎడ్యుకేటర్‌ విఎస్‌ఆర్‌కె.కుమారి, హెచ్‌వి.లలితకుమారి, జయలక్ష్మి, పట్టణ ఆరోగ్య కేంద్రాల ఎఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.
మొగల్తూరు : మండలంలోని ముత్యాలపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలల అంతర్జాతీయ బాలిక దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య వర్షిని వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలో బాలికల హక్కులను తెలియజేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌ చక్రవర్తి, గుడాల తాతారావు, బొక్క కోటేశ్వరి, కొల్లాటి వెంకటేశ్వరమ్మ, చింత దుర్గ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
పాలకొల్లు : పాలకొల్లు పట్టణ పరిధిలోని జివిఎస్‌విఆర్‌ఎం మున్సిపల్‌ పాఠశాలలో బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది కర్ర జయసరిత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనం తరం విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సాయి, హెచ్‌ఎం భవానీప్రసాద్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాళ్ల : ఏలూరుపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత అంశాలపై బాలికలకు వివరించారు. ఉపాధ్యాయుడు కట్టా వెంకటేశ్వరరావు, అంగన్‌వాడీ టీచర్‌ లక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎఎన్‌ఎంలు, ఆశ, అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
పాలకోడేరు : శృంగవృక్షంలో నిర్వహించిన సభలో సర్పంచి జంగం సూరిబాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సభలో ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ పార్వతి, ఉప సర్పంచి కలిదిండి ఆనందరాజు, వార్డు మెంబర్‌ సోము దుర్గాభవాని, ఎంపిడిఒ నూకల మురళీగంగాధరరావు, పంచాయతీ కార్యదర్శి దొంగ సత్యనారాయణ, సచివాలయ కార్యదర్శి లక్ష్మీదేవి, దిలీప్‌, విఆర్‌ఒ భోగేశ్వరరావు, అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.
పెనుమంట్ర : బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని ఐసిడిఎస్‌ సిడిపిఒ ఎ.కృష్ణకుమారి అన్నారు. బాలికల దినోత్సవం సందర్భంగా పెనుమంట్ర హైస్కూల్‌ విద్యార్థులకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను గురించి అంగన్‌వాడీల ఆధ్వర్యంలో వివరించారు.