
ఘనంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం
- పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకోవాలి : కలెక్టర్
- వేగంగా అభివృద్ధి పనులు పూర్తి : ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
జిల్లాలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ సర్కిల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, అడిషనల్ ఎస్పీ వెంకట రాముడు, డిఆర్వో పుల్లయ్య తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసిన గొప్ప మహనీయులు పొట్టి శ్రీరాములఅని స్మరించారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాల్లో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్, ఎంఎస్‌ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అబ్దుల్ కలాం, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు నివాళ్లులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులకు జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్, జెసిలు జ్ఞాపికలను అందజేశారు. అనంతరం సెంటినరీ హాల్ ఆవరణలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో నవరత్నాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన అతిధులు తిలకించారు.
పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
పట్టణంలోని సంజీవనగర్ సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్మన్ మాబున్నీసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పామ్ షావలి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, 2వ పట్టణ అధ్యక్షుడు పున్న శేషయ్య, వైసిపి కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, 19వ వార్డు శ్రీరాములు, ఆంధ్ర మెడికల్ రమేష్ పాల్గొన్నారు. బనగానపల్లె : పట్టణంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో ఆర్యవైశ్య సంఘం నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు టంగుటూరి శీనయ్య, శాశ్వత గౌరవాధ్యక్షులు పిఎస్‌ఎస్ నారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు జక్కా నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీరామ సుబ్రహ్మణ్యం, నాయకులు డి వెంకటసుబ్బయ్య, నల్లగట్ల వెంకటేశ్వర్లు, కాసుల జంగం శేట్టి, నల్లగట్ల శివయ్య, శివ రాజ్ పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలతాదేవి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు బాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాముఖ్యత పై ఉపాన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అవుకు : పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మేడం ఆంజనేయులు, తల్లం సుబ్బ నాగభూషణం, విశ్వనాథం సుబ్రహ్మణ్యం, మల్లెల సూర్యనారాయణ, పి సాయిప్రసాద్, జి సుదర్శనం, యువజన సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లె నాగేంద్ర కుమార్, బచ్చు నాగరాజు, తాళ్లపల్లి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ : పట్టణంలో స్వామి వివేకానంద విశ్వ మానవ సేవ సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంత మార్కెట్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళుల్పించారు. సేవా సమితి అధ్యక్షులు శివప్రసాద్, ఉపాధ్యక్షులు వర్ధనా చారి, సభ్యులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా.శివరామయ్య, వైస్ ప్రిన్సిపాల్ డా.గంగన్న తదితరులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.