Aug 23,2023 21:07

రాయచోటి : ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఎఒ బాలక్రిష్ణ

రాయచోటి : స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శమూర్తి అని కలెక్టరేట్‌ ఏఓ బాలకష్ణ అన్నారు.బుధవారం రాయచోటి కలెక్టరేట్‌ లో 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి కలెక్టరేట్‌ ఎఒ బాలకష్ణ, జిల్లా బిసి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సందప్ప, జిల్లా పర్యటక శాఖ అధికారి నాగభూషణం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ఎఒ బాలకష్ణ మాట్లాడుతూ నైతిక విలువలను ప్రాణంగా భావించే ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని అన్నారు. నమ్మినదాన్ని ఆచరించడంలో, నైతికంగా వ్యవహరించడంలో ఆయనకు ఆయనే సాటని అన్నారు. ఆయన బాటలో అంతా నడవాలని పిలుపునిచ్చారు. జిల్లా బిసి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సందప్ప మాట్లాడుతూ నిబద్ధత, ధైర్యం, సమైక్యతకు నిదర్శనమన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు అన్నారు. అలాంటి మహ నీయుల అడుగుజాడలో నడుచుకోవడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. కలెక్టరేట్‌ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
బి.కొత్తకోట : స్థానిక నగర పంచాయితీ కార్యాలయంలో బుధవారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంచాయతీ అకౌంట్స్‌ ఆఫీసర్‌ రమాదేవి మాట్లాడుతూ ఆంగ్లేయుల చెర నుంచి భారతదేశానికి విముక్తి కల్పించడానికి ఆయన ఉత్తేజపూరిత ప్రసంగాలు చేసి యువతలో స్ఫూర్తి నింపారన్నారు. ఓవైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే,మరోవైపు తన ప్రసంగాలతో బ్రిటిష్‌ వారి వెన్నుల్లో వణుకు పుట్టించారన్నారు.బ్రిటిష్‌ వారి తూటాలకు ఎదురెళ్లిన మహావీరుడు అని ఆమె కొనియాడారు.స్వతంత్ర సంగ్రామంలో తనువంతు పాత్ర పోషించినందుకు టంగుటూరి ప్రకాశం పంతులకు ఆంధ్ర కేసరి అనే బిరుదు వరించిందన్నారు.మహనీయులను స్మరించుకోవాలని,టంగుటూరి ఆశయసాధన కోసం మనమంతా కషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ కిరణ్‌ కుమార్‌, మోహన ,తేజ ,రాంబాబు, శివ పాల్గొన్నారు.వాల్మీకిపురం: బ్రిటిష్‌ పాలకుల తుపాకులకు గుండెచూపి కాల్చమని వారి గుండెల్లో నిలిచిపోయిన ఆంధ్రుడు, ఆంధ్రకేశరి దివంగత మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని స్థానిక విపిసి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు. జనవిజ్ఞన వేదిక ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ఉమా అమరేశ్వరి, అధ్యాపకులు ప్రసాద్‌, భాస్కర్‌, రమణ, కళావతి, జానిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.