Oct 15,2023 00:18

ప్రజాశక్తి - భట్టిప్రోలు
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించి 67ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక బౌద్ధ స్తూపం ఆవరణలో దమ్మా దీక్షను శనివారం ఘనంగా నిర్వహించారు. బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా బాపట్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బిఎస్ఐ జిల్లా అధ్యక్షులు దారం సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఉపాధ్యక్షులు కెకె బోధి బుద్ధ మంధనం పంచశీల సూత్రాల గురించి వివరించారు. దేశంలో సర్వమత సమానత్వం, సాంఘిక దురాచారాలు రూపుమాపటానికి బౌద్ధమతం ఒకటే మార్గమని నమ్మిన అంబేడ్కర్ 1956అక్టోబర్ 14న సుమారు 6లక్షల మందితో ఆనాడు బౌద్ధ మతాన్ని స్వీకరించారని వక్తలు గుర్తు చేశారు. గ్రామ సర్పంచ్ ద్వారా రవికిరణ్మయి మాట్లాడుతూ క్రీస్తుపూర్వం మూడు శతాబ్దాల క్రితం భట్టిప్రోలులో నిర్మితమైన బౌద్ధ స్తూపం అత్యంత ప్రాచీనమైనదని అన్నారు. దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిస్తే ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజ్యలుతుందని అన్నారు. 45అడుగుల బుద్ధుని విగ్రహానికి కూడా ఇక్కడ నిర్మించాల్సి ఉందని అన్నారు. అందుకు ప్రభుత్వం నుండి తీసుకోవలసిన చర్యలపై సమీక్షిస్తామని అన్నారు. కార్యక్రమంలో బుద్ధిష్టు సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండ్రపాటి అశోక్ కుమార్, బిఎస్ఐ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు అందే శ్యామ్, జై భీమ్ భారత పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు దొవా రమేష్ రాంజీ, చెన్నయ్య, పేర్ల మోజేష్, గుండాల సునీల్, చెరుకూరి లక్ష్మణరావు, జడ రవీంద్ర, పి నాగేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రకాష్, నంబూరు కార్తీక్ పాల్గొన్నారు.