Aug 08,2023 22:04

అడివితల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న ఐటిఇఎ పిఒ, గిరిజనంఘాల నాయకులు

ప్రజాశక్తి - బెలగాం : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్థానిక ఐటిడిఎ కార్యాలయం ఆవరణలో అడవితల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అడవితల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక జూనియర్‌ కళాశాల దుర్గాదేవి గుడి వద్ద గిరిజన సంఘాల నాయకులు పిఒకు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుండి ఆయన్ను గిరిజన సాంప్రదాయ, వాయిద్య, నత్య ప్రదర్శన చేస్తూ ఐటిడిఎ కార్యాలయంలో అడవితల్లి విగ్రహం వరకు తీసుకువచ్చారు. గిరిజన సాంప్రదాయ పధ్ధతి లో పూజలు నిర్వహించారు. అడవితల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు గిరిజన సంఘాల నాయకులు మంచాల పారమ్మ, కోలక గౌరమ్మ, మువ్వల అమర్‌నాధ్‌ , బిడ్డిక తమ్మయ్య, పాలక రంజిత్‌ కుమార్‌, పల్ల సురేష్‌, దుక్క సీతారాం, నందివాడ కష్ణ బాబు, చెల్లూరి సీతారాం, ఆరిక చంద్రశేఖర్‌, జయసింహ, మణి కుమార్‌, గిరిజన విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన
సీతంపేట : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సభలో సంఘం సీనియర్‌ నాయకులు బిడ్డిక అప్పారావు మాట్లాడుతూ జీవో 3కు చట్టబద్ధత కల్పించాలని, బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పించొద్దని, 1/70చట్టం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పీసా చట్టం గ్రామ సభ జరిగేలా చేయాలన్నారు. మణిపూర్‌లో ఆదివాసీలకు జరుగుతున్న మరణ హౌమాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. నాయకులు కొండగొర్రి భాస్కరరావు మాట్లాడుతూ నాన్‌షెడ్యూల్‌ గ్రామాలను ఐదో షెడ్యూల్లో చేర్చాలన్నారు. బిడ్డిక సాయి మాట్లాడుతూ అటవీహక్కుల చట్టం పటిష్టంగా అమలు చేసి గిరిజనులకు ఉపయోగపడేలా సవరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు సవర గంగయ్య, సవర శ్రీను, ఆరిక గంగాధర్‌, సవర ఆనందరావు, నాయకులు పాల్గొన్నారు.