Aug 09,2023 00:31

ప్రారంభిస్తున్న అప్పలనర్స, నాయకులు

ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో పలు చోట్ల అంతర్జాతీయన ఆదివాసీ దినోత్సవ సంబరాలు మంగళవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదివాసీ గిరిజన సంఘం జెండాలను ఆవిష్కరించారు.
పాడేరు: ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా హక్కుల దినంగా నిర్వహించాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు మేరకు మంగళవారం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుండి శ్రీ మోదకొండమ్మ ఓపెన్‌ ఆడిటోరియం వరకు దింసా కళాకారులతో ఊరేగింపు నిర్వహించారు. ఈనెల 1నుండి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసి గిరిజన సంఘం ఆదివాసి హక్కుల దినంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ మేరకు పాడేరు లో మంగళవారం నిర్వహిస్తున్న ఆదివాసీ హక్కుల దినం కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆదివాసీ సంస్కతిక కార్యక్రమాన్ని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నేత పి.అప్పలనర్శ, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఐ.కొండలరావు తుడుము వాయిస్తూ ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పలనర్శ మాట్లాడుతూ, ఆదివాసి హక్కుల రక్షణకై ప్రభుత్వాలు కృషి చేయాలని, ఆదివాసి గ్రామ అధికారాన్ని ప్రభుత్వం అమలు చేయడంతోనే ప్రభుత్వపై ఆదివాసులకు విశ్వాసం కలుగుతుందన్నారు. అనంతరం డిప్యూటీ డైరెక్టర్‌ కొండలరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి ఎస్‌. ధర్మానపడాల్‌, పి బల్‌ దేవ్‌, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్‌ సుందర్‌ రావు, పి. లక్కు, కె.సత్యనారాయణ, సోమేలి చిట్టిబాబు, ఆదివాసీ సాంస్కతిక కళావేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జోషి, కృష్ణారావు, సిఐటియు నాయకులు ఎస్‌.నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు చిన్నారావు, నరేష్‌ పాల్గొన్నారు.
చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి
పాడేరు : ప్రధాని మోడీ, సిఎం జగన్‌ లు గిరిజన చట్టాలు, హక్కులను పటిష్టంగా అమలు చేయాలని గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజరు డిమాండ్‌ చేశారు. మంగళవారం చింతపల్లి మండల కేంద్రం వద్ద హనుమాన్‌ జంక్షన్‌ కూడలిలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం సంయుక్తంగా గిరిజన సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసాంఘిక శక్తులు కుల, మత విద్వేషాలు రెచ్చ గొట్టి దేశవ్యాప్తంగా గిరిజనులపై, గిరిజన మహిళలపై తీవ్రమైన దాడి జరుగుతుంటే ఇప్పటికీ ఏ రకమైన చర్యలు చేపట్టలేదన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి, నాయకులు కీల్లో సింహాచలం, మజ్జి రాంబాబు, విద్యార్థి సంఘం నాయకులు పాంగి జీవన్‌ కృష్ణ, కొర్ర కార్తీక్‌ పాల్గొన్నారు.
డుంబ్రిగుడ:ఈనెల 9న బుధవారం జరగనున్న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవాలని మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె కృష్ణకుమారి ఆదివాసులకు పిలుపునిచ్చారు. ఆదివాసుల సాంస్కతి సంప్రదాయాలతో పాటు కట్టు బోట్టు, ఆచార వ్యవహారాలను బాహ్య ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు.
ఆదివాసీ గిరిజన సంఘం జెండా ఆవిష్కరణలు
మారేడుమిల్లి:ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా ఎపి ఆదివాసీ గిరిజన సంఘం జెండాలను ఆ సంఘం నాయకులు వై.రామవరం మండలం రాములకొండ, కప్పల బంధ, దబ్బమామిడి గ్రామాల్లో గిరిజనులు సమక్షంలో ఎగరవేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు కె.శాంతిరాజు మాట్లాడుతూ, అడవులపై ఆదివాసీలు పోరాడి సాధించుకున్న హక్కులను తొలగించి కార్పొరేట్‌ కంపెనీలకు బిజెపి ప్రవేశం కల్పిస్తుందన్నారు. స్వాతంత్య్రం వచ్చి నేటికి 76 ఏళ్ళు దాటినా ఆదివాసీలకు తిండి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు లేక దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనేతరులైన బోయవాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చి రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్ర బీజేపీ, రాష్ట్ర వైసిపి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండలం కార్యదర్శి గడుతూరి మల్లిఖార్జున రావు, నాయకులు పి.లింగారెడ్డి, గిరిజనులు పాల్గొన్నారు.
సీలేరు : జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ నేలజర్త గ్రామంలో ఆదివాసీ నాయకులు కోడా ఆనంద్‌, గణేశ్వరరావు, మార్కరాజు ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. గిరిజనులు తమ సంప్రదాయాలకు అద్దంపట్టేలా నడుముకు ఆకులు కట్టుకొని, విల్లంబుల చేతబట్టి జై ఆదివాసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు సుంకర విష్ణుమూర్తి, మాజీ సర్పంచ్‌ ఏసు వరరాజు పాల్గొన్నారు.