Aug 09,2023 22:09

గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేస్తున్న ఐటిడిఎ పిఒ కల్పన, ఎమ్మెల్యే కళావతి

ప్రజాశక్తి-సీతంపేట : సీతంపేట ఐటిడిఎలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఐటిడిఎ పిఒ కల్పనకుమారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. అడవితల్లి విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలతో ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకొండ, పాతపట్నం ఎమ్మెల్యేలు వి.కళావతి, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ విక్రాంత్‌, సబ్‌కలెక్టర్‌ నూరుల్‌ కమల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఎ పిఒ కల్పనకుమారి మాట్లాడుతూ ఐటిడిఎ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధిని వివరించారు. ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ గిరిజనుల కోసం సీతంపేటలో 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ విక్రాంత్‌, ఎమ్మెల్యే రెడ్డి శాంతి, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌కమల్‌ మాట్లాడారు. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా నృత్యాలను విద్యార్థులు, గిరిజన కళాకారులు ప్రదర్శించారు. అడవితల్లి విగ్రహం నుంచి డప్పులు, నృత్యాలతో ర్యాలీ చేపట్టారు. గిరిజన వేషధారణలో పిఒ కల్పన కుమారి, ఎమ్మెల్యే కళావతి గిరిజనులతో థింసా నృత్యం చేశారు. అనంతరం హార్టికల్చర్‌, అంగన్వాడీ, వ్యవసాయ శాఖ, జిసిసి స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో ఎంపిపిలు బి.ఆదినారాయణ, తోట సింహాచలం, జెడ్‌పిటిసి లక్ష్మి, ఎఎంసి చైర్మన్‌ మోహన్‌రావు, రాము, గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.సత్యారావు, కార్యదర్శి జన్ని అప్పన్న, జిల్లా అధ్యక్షులు ఎ.మన్మథరావు, ప్రధాన కార్యదర్శి కె.కాంతారావు, సర్పంచ్‌ కళావతి, వైస్‌ ఎంపిపి సరస్వతి, ఎంపిటిసిలు చంద్రశేఖర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇఇ సింహాచలం, డిడి శ్రీనివాసరావు, పిహెచ్‌ఒ వెంకటేష్‌, పిఎఒ హరికృష్ణ, డిప్యూటీ డిఇఒ లిల్లీరాణి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ చిరంజీవి, ఎటిడబ్ల్యు మంగవేణి, సిడిపిఒ రామలక్ష్మి పాల్గొన్నారు.